Pushpa Movie: పుష్పలో కన్నా పార్ట్ 2 లో ఎక్కువగా అలాంటి సన్నివేశాలు ఉండాలని సూచించిన బన్నీ… కసరత్తు మొదలు పెట్టిన సుక్కు!

Pushpa Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో నటించిన మొట్టమొదటి చిత్రం పుష్ప. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా విడుదల వరకు ఉత్తరాది ప్రేక్షకులకు అల్లు అర్జున్ అంటే కూడా తెలియదు. అలాంటిది పుష్ప సినిమా ద్వారా ఉత్తరాది రాష్ట్రాలలో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న అల్లు అర్జున్ కి దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ మాస్ లుక్, డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టడంతో పుష్ప 2 విషయంలో కూడా సుకుమార్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడుతోంది.ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పుష్ప పార్ట్ వన్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఈ క్రమంలోనే పుష్ప పార్ట్ 2 లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉండేలా చూడమని డైరెక్టర్ సుకుమార్ కు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుకుమార్ యాక్షన్ కొరియోగ్రఫర్లు .. డాన్స్ కొరియోగ్రఫర్లు కొత్తదనం కోసం కసరత్తు మొదలెట్టారని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel