#Govt Jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs

Mahashivratri 2026 : మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం తర్వాత ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి.. ఏం జరుగుతుందంటే?

By Vinod Kumar

Published on: February 13, 2026

Follow Us

Mahashivratri 2026

---Advertisement---

  • మహాశివరాత్రి రోజున శివుని ఆలయంలో రుద్రాభిషేకం
  • ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం 5:04 గంటలకు చతుర్దశి ప్రారంభం
  • రుద్రాభిషేకం తర్వాత ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి

Mahashivratri 2026 : రుద్రాభిషేకం చేయాలని అనుకుంటున్నారా? ప్రతి ఏడాదిలో ఫాల్గుణ మాసం చతుర్దశి తిథి రోజున మహాశివరాత్రి పవిత్ర పండుగను జరుపుకుంటారు. ఈ రోజున శివుడు, పార్వతి దేవి వివాహం చేసుకున్నారని అంటారు.

శివుడు మొదట శివలింగ రూపంలో ఈరోజునే కనిపించాడని పురాణాలు చెబుతున్నాయి. శివుడు, పార్వతి దేవి పూజ, భక్తికి చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఈ రోజున శివలింగానికి అభిషేకం చేయడం వల్ల అద్భుతాలు జరుగుతాయని నమ్ముతారు.

సనాతన ధర్మంలో ఈ రోజున భక్తి, విశ్వాసంతో పూజలు చేయడం, ఉపవాసం ఉండటం వల్ల జీవితంలోని అన్ని దుఃఖాలు, బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. మహాదేవుడి నుంచి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు.

Read Also : Ayushman Card : ఆయుష్మాన్ కార్డుతో ఏడాదికి ఒక్కసారి మాత్రమే చికిత్స తీసుకోవాలా? అసలు ప్రభుత్వ రూల్స్ ఇవే

ఈ ఏడాదిలో మహాశివరాత్రి రోజున శివుని ఆలయంలో రుద్రాభిషేకం చేయాలని అనుకుంటున్నారా? రుద్రాభిషేకం తర్వాత ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం అసలు మర్చిపోవద్దు. మహాశివరాత్రి పర్వదినాన ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల వైవాహిక జీవితంలో అనురాగం, అన్నోన్యత, ప్రేమ, నమ్మకం బలపడతాయని విశ్వసిస్తారు.

2026 మహాశివరాత్రి ఎప్పుడంటే? :
క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాదిలో ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి తిథి ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం 5:04 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 5:34 గంటలకు ముగుస్తుంది. ఉదయించే తేదీ ప్రకారం.. మహాశివరాత్రి ఫిబ్రవరి 15న జరుపుకుంటారు.

  1. రుద్రాభిషేకం అయ్యాక గుడి నుంచి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి :
  2. మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం తర్వాత శివలింగానికి సమర్పించిన బిల్వ పత్రాన్ని ఇంటికి తీసుకురావాలి.
  3. శివలింగానికి సమర్పించిన బిల్వ పత్రాన్ని తీసుకురావడం చాలా శుభప్రదం.
  4. ఇంటికి వచ్చాక మీ పర్స్ లేదా ఇంటి దేవుడి గదిలో ఉంచండి. సంపద స్థిరంగా ఉంటుంది.
  5. ఈ రోజున, మహిళలు ఇంటికి తెచ్చుకుని పార్వతి దేవికి గాజులు, సింధూరం, గోరింట ఇతర వస్తువులను ధరించాలి.
  6. అదృష్టాన్ని తెస్తుందని అందరూ నమ్ముతారు. వివాహ జీవితంలో ప్రేమ, అవగాహన అభిమానాలు పెరుగుతాయి.
  7. మహాశివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం చేసేందుకు వాడే నీటిని ఇంటికి తెచ్చుకోవచ్చు.
  8. కలశం లేదా చిన్న పాత్రలో ఆ నీటిని ఉంచాలి. ఇంటి చుట్టూ, అనారోగ్యంతో ఉన్నవారిపై చల్లాలి.
  9. ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపేయొచ్చు. మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.
  10. అభిషేకం తర్వాత మిగిలిపోయిన గంధం లేదా కుంకుమ పేస్ట్‌ను ఇంట్లోనే ఉంచాలి.
  11. ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది.
  12. శివలింగానికి సమర్పించిన పువ్వులను కూడా ఇంటి పూజా స్థలంలో ఉంచాలి.

Disclaimer : ఈ వార్తలోని సమాచారం కేవలం మత విశ్వాసాల ఆధారంగా అందించడం జరిగింది. Tufan9 దీనిని ఆమోదించదని గమనించాలి.

, , , , ,