Astrology Remedy : అనుకున్న పని అనుకున్నట్లు అవ్వాలంటే కుంకుమతో ఇలా పరిహారాలు చేయండి.. కష్టాలన్నీ పోతాయి!

Updated on: January 30, 2025

Astrology Remedy : చేస్తున్న పనుల్లో పదేపదే వచ్చే ఆటంకాలని తొలగిపోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసా? పనుల్లో ఎప్పుడూ ఆటంకాలు ఎక్కువ వస్తూ ఉంటే కొన్ని అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి. మీ పనులు తొందరగా కావాలన్నా కొన్ని రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే.. వక్క గణపతి.. వక్క మీద గణపతిని చెక్కుతారు అనమాట. ఇంట్లో పూజ గదిలో ఈ వక్క గణపతిని పెట్టుకోవాలి. దానికి రోజు కుంకుమ బొట్టు పెట్టాలి.

అప్పుడు మీ పనులు తొందరగా అవుతాయి. అలాగే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఆ పని అవ్వటం కష్టం అనుకుంటే.. ఆ పని చాలా ఈజీగా అవ్వాలంటే మరో పరిహారం కూడా పాటించవచ్చు. ఇంటి గుమ్మం బయట ఆవనూనె దీపం వెలిగించి వెళ్ళండి. ఆ దీపం వెలుగుతున్నప్పుడు ఒక లవంగం అందులో వేసి ఆ తర్వాత మీ పని మీద వెళ్ళండి. మీరు వెళ్లే పని ఎంత కష్టమైనా సరే తొందరగా నెరవేరుతుంది. ఈ ఆవనూనె దీపం వెలిగించి అందులో లవంగం వేసి వెళ్తే ఆ పని చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే శనీశ్వరుడు, శుక్రుడు ఈ రెండు గ్రహాల బలం పెరుగుతుంది.

Astrology Remedy : కొబ్బరికాయకు ఇలా కుంకుమ బొట్లు పెట్టండి :

అలాగే, రోజు ప్రాతః కాలంలో సూర్యోదయ సమయంలో లేదా సూర్యోదయానికి ముందు తులసి కోట దగ్గర ధూపం వేయండి. ఇంట్లో వాళ్లకు పనులు చాలా సులభంగా అవుతుంది. అలాగే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ తీసుకోండి. దానికి కుంకుమ బొట్లు పెట్టండి. మీ దగ్గర పెట్టుకొని మీరు పని మీద బయటకు వెళ్లండి. ఈ పని పూర్తయ్యాక ఆ కొబ్బరికాయ ఎక్కడైనా గణపతి టెంపుల్‌లో ఇచ్చేయండి. ఆ గణపతి టెంపుల్‌లో కొబ్బరికాయ కొట్టడానికి ఉపయోగిస్తారు.

Advertisement

ఇలా చేస్తే మీకు పనులు తొందరగా అవుతాయి. ఎప్పుడైనా చాలా కష్టమైన పనైనా సరే చాలా ఈజీగా అయిపోవాలంటే ఓ కొబ్బరికాయ తీసుకొని కుంకుమ బొట్లు ఒక మూడు బొట్లు గానే ఐదు బొట్లు పెట్టి దగ్గర పెట్టుకొని వెళ్ళండి మీకు ఆ పని కచ్చితంగా అవుతుంది. పనైపోయాక గణపతి దేవాలయంలో ఇచ్చేయండి. ఎప్పుడైనా సరే పనుల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటే కపిల గోవుకి బెల్లం తినిపించాలి. అప్పుడు మీ పనులు ఈజీగా పూర్తి అవుతాయి.

పసుపు కొమ్ముకి కార్యసిద్ధిని కలగజేసే శక్తి ఉంటుంది. మీ దగ్గర ఒక పసుపు కొమ్ము పెట్టుకోండి. పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పసుపుకొమ్ము దగ్గర పెట్టుకుంటే కనుక ఆ పని చాలా సులభంగా పూర్తవుతుంది. అలాగే ఎప్పుడు పని మీద బయటకు వెళ్తున్న ‘శ్రీం సర్వసిద్ధికరాయ వర్తమానాయ నమః’ ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకొని గడప దాటి వెళ్తే మీ పనులు సులభంగా పూర్తవుతాయి.

Read Also : Weight Loss Drink : మధ్యాహ్న భోజనంలో ఈ డ్రింక్ తాగితే.. శరీరంలోని కొవ్వు అంతా వెన్నలా కరిగిపోతుంది!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel