LIquor online delivery : ఇప్పుడంతా ఆన్ లైన్ కాలమే నడుస్తోంది. కూరగాయల నుంచి వేస్కునే బట్టల వరకు ఏం కావాలన్నా అంతా ఆన్ లైన్ లోనే బుక్ చేస్తున్నారు. ఇంటికి వచ్చిన వస్తువులను డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారు. అయితే ఓ స్టార్టప్ మాత్రం మరో అడుగు ముందుకేసింది. మద్యం ప్రియుల కోసం… మద్యాన్ని హోం డెలివరీ చేస్తామని చెప్తోంది. అయితే ఇది మన దగ్గర అనుకునేరు. ఇది కోల్ కతాలో. మీరు మద్యం ఆర్డర్ చేస్తే పది పది నిమిషాల్లో మందు మీ ఇంటి ముందుకొస్తుంది.
హైదరాబాద్ కు చెందిన ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటిడె అనే కంపెనీ మద్యం దుకాణాల ముందు జనాలు క్యూ కట్టడాన్ని గమనించి.. దాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్‌శాఖ అనుమతి పొందిన తర్వాత కోల్‌కతాలోని తూర్పు ప్రాంతంలో ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. మద్యం డెలివరీ చేసేలా బంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని బూజీ సంస్థ సీఈఓ వివేకానంద తెలిపారు. కల్తీ మద్యం, మైనర్లకు డెలివరీ చేయకుండా నిబద్ధతతో పనిచేస్తామని ఆయన చెప్పారు.
Read Also : Ap Movie Ticket Issue : ఏపీలో సినిమా టిక్కెట్ల విషయంలో కొత్త మార్గదర్శకాల విడుదల ..!