Jabardasth vinodini : తండ్రైన జబర్దస్త్ వినోదిని.. లక్ష్మీదేవి పుట్టిందంటూ ఫొటోలు షేర్!

Updated on: June 2, 2022

Jabardasth vinodini : జబర్దస్త్ చూసే వాళ్లకు వినోదిని తెలియని వాళ్లుండరు అంటే అతిశయోక్తి కాదు. అబ్బాయే అయినా ప్రతీ స్కిట్ లో అమ్మాయి వేషం వేస్కొని అందిరినీ అలరిస్తుంటాడు. మగతనాన్ని పక్కన పెట్టి మూతిన మీసం తీసి ఆడ వేశం కట్టిన వినోద్… ఎన్నెన్నో కష్టాలను ఎదుర్కున్నాడు. చాలా మంది ఈయన నిజంగానే అమ్మాయంటూ అనేవారు. అందర్నీ నవ్వించే ఈయన కొన్ని వందల సార్లు నవ్వుల పాలయ్యాడు. ఇలాంటి వారికి ఎవరైనా అమ్మాయిని ఇస్తారా అనే అనుమానం చాలా మందికి వచ్చే ఉంటుంది. కానీ ఈయన ఇవన్నీ దాటుకొని పెళ్లి కూడా చేస్కున్నారు. మేమూ మీలాంటి వాళ్లమే.. జీవనోపాధి కోసమే ఇలా చేస్తున్నాం అంటూ చాలా సార్లు ఎమోషనల్ అయ్యాడు.

Jabardasth vinodini_
Jabardasth vinodini_

అయితే తాజాగా జబర్దస్త్ వినోద్.. అలియాస్ వినోదిని.. ఓ ఆడ బిడ్డకు తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ…. తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియోను షేర్ చేశాడు. తనకి పండంటి ఆడ బిడ్డ పుట్టిందని… ఇంటికి లక్ష్మీ దేవి వచ్చిందంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియో చూసిన వారంతా కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

Advertisement

Read Also : Samantha : బిగ్‌బాస్‌లోకి సమంత ఎంట్రీ.. నాగార్జున ఔట్… ఆరో సీజన్‌కు రంగం సిద్ధం..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel