October 5, 2024

SI Prelims: ఆగస్ట్ 7న ఎస్ఐ ప్రిలిమ్స్..? జాబ్ కొట్టాలంటే ప్రిపరేషన్ ఇలా…!

1 min read
pjimage 2022 05 14T091338.160

SI Prelims: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఉన్నటువంటి17,291పోస్టులను భర్తీ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఈనెల 20 వ తేదీ వరకు చివరి గడువు ఉంది. ఈ క్రమంలోనే ఈ పోస్టులు భర్తీ చేయడం కోసం పోలీస్ నియామక మండలి తొలి దశ అయిన ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

pjimage 2022 05 14T091338.160ఈ క్రమంలోనే ఎస్సై ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టు 7వ తేదీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ విధంగా ఎస్ ఐ ప్రిలిమ్స్ పూర్తయిన తర్వాత రెండు వారాల వ్యవధి అనగా ఆగస్టు 21వ తేదీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షలను నిర్వహిస్తున్నట్లు సమాచారం ఈ ఉద్యోగాలకు ఈనెల 20 తేదీ వరకు గడువు ఉండటంతో గడువు పూర్తయిన తర్వాత అర్హులైన అభ్యర్థులకు కు హాల్ టికెట్స్ జారీ చేయనున్నారు.

ప్రిలిమ్స్ పరీక్ష ను 200 మార్కులకు నిర్వహించనున్నారు. ఇందులో 30 శాతం మార్కులను అర్హత మార్కులుగా పోలీస్ శాఖ నిర్ణయించింది. ప్రిలిమ్స్ లో ఎవరైతే 30 శాతం మార్కులను సాధిస్తారో వారిని తదుపరి దశకు అర్హులుగా ప్రకటించనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు ఎస్సై కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు ఇవేనని వార్తలు బలంగా వినిపించడంతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పెద్ద ఎత్తున కసరత్తు మొదలుపెట్టారు. అయితే త్వరలోనే ఈ విషయం గురించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనునట్లు తెలుస్తోంది.