...

Mahesh babu fans : మిల్క్ బాయ్ ఫ్యాన్స్ హంగామా.. థియేటర్ అద్దాలు ధ్వంసం!

Mahesh babu Fans : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ ను గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు చిత్ర బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కూకట్ పల్లి బ్రమరంభ థియేటర్ లో ట్రైలర్ విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ చూసేందుకు మిల్క్ బాయ్ మహేష్ బాబు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్ వద్దకు వచ్చారు. అప్పటికే లోపల చాలా మంది ఉండండతో… థియేటర్ సిబ్బంది కొంత మందిని లోపలికి వచ్చేందుకు అనుమతించలేదు. అయితే తమను రానివ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మహేష్ బాబు అభిమానులు.. థియేటర్ అద్దాలను ధ్వంసం చేశారు. అయితే ఈ ఘటనలో పలువురు అభిమానులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వేంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Mahesh babu Fans
Mahesh babu Fans

2.36 సెకన్ల నిడివితో ఉన్న మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ ట్రైలర్ ని చూసి అభిమానులు తెగ సంబరపడుతున్నారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ మహేష్ బాబు హీరోయిన్ కీర్తి సురేష్ తో చెప్పిన డైలాగ్ బాగా పేలింది. అయితే ఈ సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవబోతోంది. అయితే ఈ సినిమాకు పరశురామ్ డైరెక్టర్, తమన్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్, 14 రీల్స్ ప్లస్ సంయుక్త నిర్మించాయి.

Advertisement

Read Also : Whisky Bottle: వామ్మో….భారీ ఎత్తుండే విస్కీ బాటిల్… ఆ పని కోసం వేలంలో విస్కీ బాటిల్?

Advertisement
Advertisement