October 5, 2024

Whisky Bottle: వామ్మో….భారీ ఎత్తుండే విస్కీ బాటిల్… ఆ పని కోసం వేలంలో విస్కీ బాటిల్?

1 min read
pjimage 6

Whisky Bottle: సాధారణంగా విస్కీ బాటిల్ ఎంత ఉంటుంది అంటే చాలా మంది మన అరచేతి పొడవు ఉంటుంది అని సమాధానం చెబుతారు. కానీ మీరు ఎప్పుడైనా ఒక మనిషి ఎత్తు ఉండే విస్కీ బాటిల్ గురించి విన్నారా. విస్కీ బాటిల్ ఏంటి? మనిషి ఎత్తు ఉండటం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా. ఇది నిజం అండి బాబు ఏకంగా 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉండే విస్కీ బాటిల్ కి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

pjimage 6స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌కు చెందిన ప్రముఖ ఆక్షన్‌ హౌజ్‌.. లైఆన్‌ అండ్‌ టర్న్‌బుల్‌ ఈ వేలంపాటను మే 25వ తేదీన ఈ ఎత్తయిన భారీ విస్కీ బాటిల్ వేలం వేయనున్నారు. ఇప్పటివరకు విస్కీ బాటిల్స్ వేలంలో 1.9 మిలియన్ డాలర్లు మన భారత కరెన్సీ ప్రకారం 14 కోట్లు రూపాయలకు అమ్ముడుపోయింది.ఈ క్రమంలోనే ఆ రికార్డును బ్రేక్ చేస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ది ఇంట్రెపిడ్‌ విస్కీ బాటిల్ కేవలం రికార్డుల కోసమే నిర్వాహకులు దీనిని భారీ మొత్తంలో తయారు చేశారు.

ఈ కంపెనీ ఇదే పేరుతో తయారు చేసే 444 రెగ్యులర్ బాటిల్స్ కలిస్తే ఎంత అయితే ఉంటుందో.. ఈ బాహుబలి విస్కీ బాటిల్ అంతే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే గత ఏడాదే ఈ బాటిల్ గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకోగా, తాజాగా ఈ బాటిల్ వేలం వేయాలని కంపెనీ భావించింది. ఈ క్రమంలోనే మే 25వ తేదీ వేసే వేలంలో భాగంగా ఈ బాటిల్ ప్రారంభ ధరనే 1.3 మిలియన్‌ పౌండ్లుగా అనుకుంటున్నారు. ఇలా ఈ బాటిల్ వేలం వేయగా వచ్చిన డబ్బులో 25% మేరీ క్యూరీ చారిటీ ట్రస్ట్ కోసం విరాళంగా ఇవ్వాలని భావించినట్లు తెలిపారు.ఇలా ఒక మంచి పని చేయడం కోసమే భారీ విస్కీ బాటిల్ ను వేలం వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.