Petrol Prices Today : వాహనదారులకు శుభవార్త.. స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు!

Petrol Prices Today : చాలా రోజుల తర్వాత వాహన దారులకు కాస్త ఊరట లభించింది. దాదాపు 17 రోజుల వ్యవధిలో కేవలం మూడు రోజులు మాత్రమే పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అంటే మొత్తం 17 రోజుల వ్యవధిలో 14 సార్లు పెట్రోల్ రేట్లు పెరిగాయి. గత కొన్ని రోజులుగా చమురు సంస్థలు దాదాపు 10 రూపాయలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు. అయితే ఇప్పుడు దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41కు చేరగా.. డీజిల్ ధర రూ.96.67కు పెరిగింది.

ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.51గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.104.77కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్​ ధర రూ.119.49ఉండగా… డీజిల్ ధర రూ.105.49కు చేరింది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.121.24కు చేరింది. డీజిల్ ధర రూ.106.91కు చేరుకుంది. వైజాగ్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.88కు చేరుకుంది. డీజిల్ ధర రూ.105.66కు ఎగబాకింది.

Read Also : RGV Dangeours Movie : ‘డేంజరస్ మూవీ’పై వర్మ సంచలన నిర్ణయం.. ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఎదుర్కొంటా… వీడియో..!

Advertisement

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel