Akhil Sarthak: బిగ్ బాస్ లో సందడి చేస్తున్న అఖిల్ ఢీ లో సందడి చేయడానికి కారణం ఇదేనా?

Akhil Sarthak: బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఓటీటీలో ప్రసారమవుతుంది. ఇలా 24 గంటల పాటు ఓటీటీలో ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో ఇదివరకే బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లు కూడా ఉన్నారు. అలా వచ్చిన వారిలో అలక రాజా అఖిల్ ఒకరు.ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమంలో అఖిల్ ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లిన కంటెస్టెంట్ లో ఎలిమినేషన్ అయ్యే వరకు బయటకు వచ్చే అవకాశం లేదు కానీ అఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటికీ ఈటీవీలో ప్రసారమవుతున్న డ్యాన్స్ షో ఢీ కార్యక్రమం లో సందడి చేస్తున్నారు.

ఇలా ఒకేసారి బిగ్ బాస్ లోనూ డాన్స్ షో లో అఖిల్ సందడి చేయడం ఏంటి ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పటికీ తాను ముందుగానే ఢీ ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ పనులన్నింటిని పూర్తి చేసుకున్నారని సమాచారం. అందుకే ఇలా రెండు కార్యక్రమాలలో సందడి చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా కాకపోయి ఉంటే మరొక రెండు మూడు వారాలలో బిగ్ బాస్ నుంచి అఖిల్ ఎలిమినేట్ అవుతారేమో అందుకే అతనిని ఇలా ఢీ షోలో కూడా కనిపించే విధంగా ముందుగా షూటింగ్ చేశారని పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి మరి అఖిల్ ఈ విధంగా రెండు కార్యక్రమాలలో కనపడటానికి అసలు కారణం ఏమిటి అనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel