Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
వసు, రిషి కలసి మినిస్టర్ దగ్గరికి వెళుతూ ఉంటారు. దారిమధ్యలో వారిద్దరూ ఫన్నీగా గొడవ పడుతూ ఉంటారు. మరొకవైపు గౌతమ్ ఇంటికి వెళ్లి ధరణి కాఫీ ఇవ్వమని అడుగుతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన దేవయాని,గౌతమ్, రిషి ఎక్కడ అని అడగగా వసు, రిషి ఇద్దరు కలిసి మినిస్టర్ దగ్గరికి వెళ్లారు అని చెప్పగానే దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
వసు ఎప్పుడూ ఎందుకు రిషి వెంటనే ఉంటుంది అని గౌతమ్ ని అడగగా వసు,రిషి పిఏ కదా పెద్దమ్మ అందుకే అని సమాధానం ఇవ్వడంతో అప్పుడు దేవయాని ధరణి పై అరిచి అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతుంది. మరొకవైపు వసు, రిషి కలసి మినిస్టర్ తో మెషిన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మినిస్టర్ మాట్లాడుతూ రిషి మీ అమ్మానాన్న చాలా మంచివారు.
మీ అమ్మానాన్న ఆశీస్సులు మనకు ఉండాలి అని చెప్పాడంతో రిషి మనసులో చాలా బాధను వ్యక్తం చేస్తాడు. అప్పుడు రిషి నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అనుకుంటున్నాను సార్ అని చెప్పి మినిస్టర్ దగ్గర్నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. రిషి మాట్లాడిన మాటలకు ఒక్కసారిగా మినిస్టర్ షాక్ అవుతాడు.
మరొకవైపు దేవయాని, జగతి ఇంటికి వెళుతుంది. అక్కడ జగతిని వసు ని ఎందుకు రిషి వెంట తిప్పుతున్నారు, మీకు తెలివి ఉందా అని మహేంద్ర, జగతి లపై విరుచుకుపడడంతో అప్పుడు జగతి తెలివిగా దేవయానికి బుద్ధి చెబుతుంది. జగతి మాట్లాడిన మాటలకు దేవయాని భయంతో టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఆ తర్వాత కాలేజీ స్టాఫ్ అందరూ రిషి దగ్గరకు వచ్చి మిషిన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి అడగగా అప్పుడు రిషి కాలేజీ ఎండి గా నేను నిర్ణయం తీసుకున్నాను నిర్ణయమే ఫైనల్ అని అనడంతో కాలేజీ స్టాఫ్ వెళ్లి వసు తో మాట్లాడతాను. అప్పుడు వసు, రిషి తో మాట్లాడటానికి వెళ్లగా వారందరి తరఫున నువ్వు మాట్లాడడానికి వచ్చావా అని అంటూ వసు ఫై అరుస్తాడు రిషి.
అంతేకాకుండా రిషి తన నిర్ణయానికి సంబంధించిన ఒక లెటర్ నోటీస్ బోర్డ్ లో ఏర్పాటు చేయించడంతో ఆ విషయం తెలుసుకున్న వసుధార రిషి ఫై కోపంతో రగిలి పోతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World