Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. రిషి, మహేంద్ర బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ మహేంద్ర రాను అని ముఖం మీద తేల్చిచెప్పడంతో ఎమోషనల్ అవుతాడు.
ఇక పోతే ఈ రోజు ఎపిసోడ్ లో రిషి, క్యాలెండర్ తీసుకువచ్చి ధరణికి ఈనెల ఒక ప్రత్యేకత ఉంది వదిన అని చెబుతూ ధరణి తో మాట్లాడుతుండగా ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తాడు. ఆ తర్వాత గౌతమ్, ధరణి ఎంత చెప్పినా కూడా వినకుండా రిషి కాలేజ్ కి వెళ్తాడు. మరొకవైపు జగతి, మహేంద్ర వారి పెళ్లి ఆల్బమ్ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు.
ఇంతలో రిషి జగతి ఇంటి దగ్గరకు వస్తాడు. వసు కిచెన్ లో వంట చేస్తుండగా రిషి, వసు కి కాల్ చేసి డాడ్ ని ఒకసారి బయటికి రమ్మను మాట్లాడాలి అని అంటాడు. కానీ మహేంద్ర మాత్రం రిషి తో మాట్లాడడానికి ఇష్టపడడు. అప్పుడు జగతి, మహేంద్ర ఒప్పించి బ్రతిమలాడి మరి రిషి దగ్గరికి పంపిస్తుంది. రిషి, మహేంద్ర ని పిలుచుకొని ఒక ప్రదేశానికి తీసుకుని వెళతాడు.
అప్పుడు రిషి మాట్లాడుతూ డాడ్ మీ బర్త్ డే సెలబ్రేట్ గ్రాండ్ గా చేయాలి అనుకున్నాను. అందుకోసం ఒక రిసార్టు కూడా బుక్ చేశాను. మనం వెళ్లి బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుందాం అని అంటాడు రిషి. అప్పుడు మహేంద్ర జగతి భార్య అని ఇప్పుడు ప్రపంచం మొత్తానికీ తెలిసింది కాబట్టి జగతి ని కాదని ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోలేను అని మహేంద్ర అంటారు.
అప్పుడు రిషి మీరు కాదు అంటారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు డాడ్ అని అనడంతో, నువ్వు కూడా బర్తడే సెలబ్రేషన్ కి నన్ను ఒక్కడివే రమ్మంటావు అని నేను అనుకోలేదు అని అంటాడు మహేంద్ర. ఇక మహేంద్ర రాను అని తేల్చి చెప్పడంతో హర్ట్ అయిన రిషి, వసు పనిచేసే రెస్టారెంట్ కి వెళ్లి సింగల్ గా కూర్చొని ఉంటాడు.
రిషి ఒంటరిగా కూర్చోవడం చూసి వసు అక్కడికి వెళ్లి స్వారీ సార్ మీరు వచ్చి నేను చూసుకోలేదు అని అంటుంది. ఆ తర్వాత రిషి మా డాడ్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవాలి అంటే ఏం చేయాలి వసు అని అడగడంతో అప్పుడు వసు మీకే తెలియాలి సార్ ఏ విధంగా మాట్లాడుతుంది.
ఆ తర్వాత రిషి, వసు కలిసి ఉల్లి మిక్సర్ బండి దగ్గరికి వెళ్లగా అక్కడ రిషి రెండు బాగా మసాలా వేసి ఇవ్వండి అని అనడంతో అప్పుడు వసు ఆశ్చర్యపోయి సార్ మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది అని అనగా అప్పుడు రిషి ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరు అవుతారు అంటారు కదా అని అంటాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World