Mallika hatches an evil plan to disrupt Janaki in todaya janaki kalaganaledu serial episode
janaki kalaganaledu Oct 14 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రామచంద్ర,జానకి, అఖిల్ విషయం గురించి జ్ఞానాంబతో మాట్లాడుతూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో రామచంద్ర అమ్మ నువ్వు అఖిల్ నీ ప్రేమగా పెంచావు. తప్పు చేశాడు అన్న కోపంతో ఇలా దూరం పెట్టావు అందుకే వాడు అలా ప్రవర్తిస్తున్నాడు. నువ్వు ఇంకా దూరం పెడితే వాడు ఇంకా ఇలా ఎన్ని పనులు చేస్తానో అని భయమేస్తుంది అమ్మ అని అనడంతో, వెంటనే జ్ఞానాంబ అఖిల్ ని క్షమించడం అంత తొందరగా జరగదు కానీ మీరు ఎన్నిసార్లు చెబుతున్నారు కాబట్టి ఆలోచిస్తాను అని అంటుంది. ఆ తర్వాత జానకి చదువుకుంటూ ఉండగా రామచంద్ర పడుకుంటాడు.
మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి జానకి అలాగే చదువుతూ నిద్రపోయి ఉంటుంది. ఇప్పుడు రామచంద్ర జానకి డిస్టబ్ చేయకుండా పంట గదిలోకి వెళ్లి జానకి కోసం కాఫీ ని తీసుకుని వస్తాడు. అప్పుడే మల్లికా నిద్ర లేచి బయటకు వచ్చి ఏంటి బావగారు ఈ సమయానికి కాఫీ తీసుకొని వెళుతున్నారు అంటూ రామచంద్ర ని ఫాలో అవుతుంది. అప్పుడు రామచంద్ర జానకి నేను మెల్లగా నిద్ర లేపి కాఫీ ఇవ్వడంతో అయ్యో మీరేంటి ఇలా అని అనగా అప్పుడు రామచంద్ర మీకోసం కాఫీ మాత్రమే కాదు ఏం చేయడానికైనా నేను సిద్ధమే అనటంతో ఆ మాటలు విన్నా మల్లికా కుళ్ళుకుంటూ ఉంటుంది.
అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండటంతో మల్లిక కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా అయినా వారి బంధాన్ని చెడగొట్టాలి అనుకుంటుంది. ఇక ఆ తరువాత ఎలా అయినా జానకి చదువుకోకుండా చెడగొట్టాలి అని బయట కూర్చుని ఆలోచిస్తూ ఇంతలో తులసి కోటను చూసి అక్కడికి వెళ్లి అమ్మ తులసమ్మ నన్ను తిట్టుకోవద్దు నన్ను క్షమించు అంటూ తులసి చెట్టు పీకేసి ఇష్టం వచ్చిన విధంగా మన్నును పారేస్తూ ఉంటుంది.
అదంతా రామచంద్ర జానకి ఇద్దరు కిటికీలో చూసి ఆ షాక్ అవుతారు. ఆ తర్వాత అక్కడికి జ్ఞానాంబ రావడం చూసి వెళ్ళిపోతుంది మల్లిక. ఇంతలో అక్కడికి వచ్చిన జ్ఞానాంబ ఇంట్లో అందరినీ పిలిచి ఏం జరిగింది ఎవరు ఇలా చేశారు అని అడుగుతుంది. అప్పుడు మల్లికా అక్కడికి ఏం జరిగింది అంటూ అక్కడికి వచ్చి ఏమీ తెలియనట్టుగా నాటకాలు ఆడుతూ ఉంటుంది. దాంతో మల్లిక వైపు రామచంద్ర అలాగే చూస్తూ ఉంటాడు.
అప్పుడు మల్లికా ఆ తప్పు జానకి చేసింది అంటూ జానకి మీదకు నింద వేస్తుంది. ఆ తర్వాత జానకి ఎలాంటి తప్పు చేయొద్దు ఒకవేళ అలా చేస్తే నా దగ్గర క్షమాపణలు కోరుతుంది అని జ్ఞానాంబ చెప్పడంతో వెంటనే మల్లికా ఆ తప్పు ను జెస్సీ మీదకు నూకాలి అని చూస్తుంది. అప్పుడు జెస్సి మీద చెప్పడంతో అత్తయ్య గారు నాకేం తెలియదు నేనేం చేయలేదు అని అంటూ ఉండగా వెంటనే జానకి నేను చేశాను అత్తయ్య గారు అనడంతో రామచంద్ర షాక్ అవుతాడు.
అప్పుడు చూసుకోవాలి కదా జానకి అని జ్ఞానాంబ అనడంతో మల్లిక షాక్ అవుతుంది. ఏదో జరుగుతుంది అంటే ఇంకేదో జరిగింది అనుకొని మల్లికా కుళ్ళుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జానకి ఆ తులసి చెట్టును నాటే ప్రయత్నం చేస్తూ ఉండగా జ్ఞానాంబ గోవిందరాజు పెళ్లినాటి ఉంగరం దొరుకుతుంది. అది చూసి వారు సంతోషపడుతూ ఉంటారు. మల్లిక తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు కుళ్ళుకుంటూ వుంటుంది.
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.