Karthika Deepam Feb 26 Episode : ఇంటికొచ్చిన మోనితాపై వంటలక్క ఫైర్.. అసలు నిజం తెలిసి ఏమి చేసిందంటే?

Karthika Deepam Feb 26 Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగనుంది. మోనిత గురించి నిజం తెలిసిన దీప ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. తమ దగ్గర ఉన్నది మోనిత కొడుకు అని తెలిసిపోతుంది. అంతేకాదు.. అసలు దీపకు కోటేష్.. కారుకు ఏంటి సంబంధం అనే విషయం తెలుసుకునేందుకు ఆరాపటపడుతుంది. అయితే ఆ పుస్తకంలో కోటేష్ రాసిన కారు నంబర్ చూస్తుంది దీప.. వాస్తవానికి ఆ కారు మోనితదనే విషయం దీపకు తెలియదు. ఆ డైరీలో ‘దండాలమ్మా.. నన్ను క్షమించు తల్లి’ అని రాసి ఉంటుంది. ఇంతకీ నంబర్ ఎవరిది.. ఎందుకు కోటేష్ ఆ డైరీలో ఇలా క్షమించమన్నాడు.. దీప ఆలోచనలో పడుతుంది. ఇంతలో మావయ్యగారికి కాఫీ ఇవ్వడం మరిచిపోయానని పుస్తకం లోపల పెట్టేసి లోపలికి వెళ్లిపోతుంది. ఇదిలా ఉంచితే.. సోఫాలో సౌందర్య, ఆనందరావు కూర్చొని ఉండగా.. ఆనందరావు ఒడిలో పిల్లాడు ఆనంద్ ఆడుకుంటూ ఉంటాడు.

ఇంతలో అక్కడికి మోనిత వస్తుంది. కొన్ని బ్యాక్స్ పట్టుకుని వస్తుంది. హలో దీపక్కా అని అంటుంది. ఆనంద్ ముఖానికి ఆనందరావు చెయ్యి అడ్డం పెడతాడు. మోనిత చూసి.. తాత ఆనందరావు గారి ఒడిలో మనవడు ఆనందరావు అంటుంది. ఏంటి.. దీపక్కా చూస్తున్నావ్.. ఇవి ఏంటి.. అనేగా.. కొత్తబట్టలు, ఊయల తెచ్చాను.. బాబుకి ఉయ్యాలా జంబాలా అంటూ జోకొట్టు.. ఓకేనా అంటుంది. నీకే సంబంధం అంటే.. ఎవరి బాబు అయినా బాబే కదా. అంటుంది మోనిత. నోరుమూసుకుని వచ్చిన దారిలోనే వెళ్లని దీప కోపడతుంది.

Advertisement
Karthika Deepam Feb 26 Episode : Deepa Knows Shocking truth about Anand Rao, Baby of Monitha

ఈ బాబును చూడగానే నా బాబు గుర్తొచ్చాడని అంటుంది మోనిత.. సౌందర్య షాక్ అవుతుంది.. అదేంటీ.. ఈ బాబు తన కొడుకు అని తెలిసినట్లుగా మోనిత మాట్లాడుతోంది..బాబును ఎత్తుకునేందుకు మోనిత ముందుకు వస్తుంది. దీప వెంటనే కోపంగా.. ఏయ్.. నా బిడ్డ మీద చెయ్యి వెయ్యకని అరుస్తుంది. ఆ బాబు నా బిడ్డే.. వీడు మా వాడే.. అని అరుస్తుంది దీప. మోనిత ఏంటి.. మర్యాదగా బయటికి వెళ్లమని సౌందర్య అంటుంది.. ఎవరి బిడ్డనో తెచ్చుకుని నా బిడ్డా నా బిడ్డా అంటున్నారుగా.. నేను మీకు ఇచ్చిన వారసుడ్ని వదిలేశారు. ఆనందరావు.. ఏంటి నీ గోల అంటాడు ఆనందరావు. నా బాబుని నాకు తెచ్చి ఇవ్వండి మావయ్యగారు అంటుంది. ఈ బాబుని నాకు ఇచ్చేయండని మోనిత అంటుంది.

మోనితను ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన దీప :
దీప.. గట్టిగా అరుస్తూ.. మోనితా వెళ్లు అవతలకు అంటుంది. నా బిడ్డ నా దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు రమ్మన్నా రాను.. అప్పుడు నా కార్తీక్కే నన్ను వెతుక్కుంటూ వస్తాడులే అంటుంది మోనిత.. దీప కోపంతో మోనితని ఆమె తీసుకొచ్చిన బ్యాగ్స్‌ని పట్టుకుని బయట పడేస్తుంది. మోనితను లాక్కెళ్లి గుమ్మం బయటకి తోసేస్తుంది. ముఖంపై తలుపు వేసేస్తుంది. దాంతో మోనిత.. కోపంతో రగిలిపోతుంది.. బై ఆనందరావు గారు తాతయ్య వాళ్ల దగ్గర హ్యాపీగా ఉండండి అంటూ మోనిత వెళ్లిపోతుంది. హిమ, సౌర్యలు బ్యాగ్స్‌తో వస్తారు.

Advertisement

మోనితను చూసిన హిమ.. నాన్నమ్మా ఆ మోనిత ఆంటీ ఎందుకు కోపంగా వెళ్తోంది అంటుంది.. సౌందర్య అదేం లేదమని మాట దాటేస్తుంది. సౌందర్య.. ఆ తర్వాత దీప బాబుతో కూరగాయలు కొనేందుకు వెళ్తుంది. రోడ్డు మీద నడుస్తూ మోనిత కారుని చూస్తుంది. ఈ కారు నంబర్ కోటేష్ బుక్‌లో ఉన్న నంబర్ కదా అంటుంది. కోటేష్ ఈ నంబర్ ఎందుకు తన డైరీలో రాసుకున్నాడు.. క్షమించమని ఎందుకు అన్నాడు అని ఆలోచించుకుంటూ వెళ్తుంది. కారులో డ్రైవర్ సీట్‌లో ఉన్న లక్ష్మణ్ కిందకు దిగుతాడు. ఈ కారు ఎవరిదని అని అడిగితే.. మోనిత మేడమ్ కారు అంటాడు. అంతే దీప షాక్ అవుతుంది. వీడు మోనిత కొడుకా? అని తెలుసుకుంటుంది. వీడితోనా మేం అనుబంధం పెంచుకుంది? అంటూ బాధపడుతుంటుంది.

Karthika Deepam Feb 26 Episode : Deepa Knows Shocking truth about Anand Rao, Baby of Monitha

రత్నసీత వీడియో చూపించేసరికి..
సీన్ కట్ చేస్తే.. రత్నసీత దగ్గరకు వెళ్తుంది దీప.. రత్నసీతా నాకో సాయం చేయాలని అంటుంది. మోనిత బాబుకు సీసీ ఫుటేజ్ చూపించావా’ అంటుంది. దీపక్కా నా దగ్గర ఆ వీడియో లేదంటుంది. మోనిత మేడమ్ చూపించొద్దని చెప్పిందని అంటుంది. దీపక్కకు చూపించాలా వద్దా అనుకుంటుంది. రత్నసీత జాలి పడి దీపక్కా నా దగ్గర ఆ వీడియో ఉందని చూపిస్తుంది. ఎంతపని చేశావ్ కోటేష్ అంటుంది. ఆ బాబును ఎత్తుకెళ్లింది కోటేశ్ అనే విషయం తెలిసిపోతుంది దీపకు.. దీపక్కా.. మోనిత మేడమ్.. ఈ వీడియోని కార్తీక్ గారికి చూపించొద్దని చెప్పారని రత్నసీత చెబుతుంది. దీప ఆ బాధలో.. మోనితకి బాబు నా దగ్గరే ఉన్నాడని తెలుసా? అనుకుంటుంది. ఎవరి దగ్గర ఈ టాపిక్ ఎత్తొద్దని అంటుంది రత్నసీత. దీప.. డాక్టర్ బాబు వచ్చి అడిగితే.. వీడియో లేదు అని అంటుంది. దీప.. బాబుని పట్టుకుని ఏడుస్తుంది..

Advertisement

రేపటి ఎపిసోడ్‌లో..
సౌందర్య ముందు ఆనంద్‌తో పాటు దీప కాళ్ల దగ్గర కూర్చుని ఉంటుంది. అత్తయ్యా పాపం.. ఆనంద్ తప్పు చేశాడా అత్తయ్యా అంటుంది. మోనిత కొడుకని మీకు తెలుసా? నాకు తెలుసు అత్తయ్యా అని అంటుంది దీప. సౌందర్య షాక్ అవుతుంది. మోనిత కొడుకని తెలిసిన తర్వాత అత్తాకోడలు కలిసి ఏం చేస్తారనేది తరువాయి భాగంలో చూడాల్సిందే..

Read Also : Hyper Aadi : హఠాత్తుగా మాయం అయిన హైపర్ ఆది.. టెన్షన్‌‌లో ఫ్యాన్స్..!

Advertisement
Tufan9 Telugu News

Tufan9 Telugu News providing All Categories of Content from all over world

Recent Posts

Top 10 Foods Diabetics : డయాబెటిస్ ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలపై ఫుల్ తెలుగు గైడ్..!

Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…

10 hours ago

Varahi Navaratri 2025 : వారాహి నవరాత్రులు.. ఎవరు చేయాలి.. ఎవరూ చేయకూడదు? తేలికైనా పూజా విధానం..!

Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…

1 week ago

Ashada Amavasya 2025 : ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు.. ఈ రోజున కచ్చితంగా ఈ ఒక్క పని చేయండి..

Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…

1 week ago

Ashadha Amavasya : 2025 ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఏ తేదీన వస్తుంది? ప్రాముఖ్యత ఏంటి?

Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…

1 week ago

WI vs AUS Test : వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా లైవ్.. టెస్ట్ సిరీస్‌ ఎప్పుడు, ఎక్కడ? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?

WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…

1 week ago

TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేయండి

TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…

1 week ago

This website uses cookies.