Karthika Deepam: తెలుగు బుల్లితెర ఫై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..బస్తీలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన హిమ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని సౌర్యా గురించి ఎంక్వయిరీ చేస్తూ ఉంటుంది.
బస్తీలో హిమ, నిరూపమ్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యం చేస్తూ ఉంటారు. అప్పుడు హిమ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని వారణాసి, అరుణ వాళ్ల గురించి అడుగుతుంది. అయితే అందరూ కూడా తెలియదు అని చెప్పడంతో సౌర్య నిరాశగా ఉంటుంది.
ఆ తరువాత హిమ సౌర్య కోసం బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేస్తుంది. మరొకవైపు ప్రేమ్, హిమ ఫోటోలను తీస్తూ హిమ వైపు అలాగే ప్రేమగా చూస్తూ ఉంటాడు. అది గమనించిన సౌర్య, ఏంటి ఎక్సట్రా తింగరి ఫోటోలు తీస్తున్నావా అని అడగగా దొరికిపోయాను అనుకున్న ప్రేమ్ లేదు అని తప్పించుకోవాలని చూస్తాడు.
అప్పుడు జ్వాలా ఆటో నడుపుతూ ఉంది కదా అని తక్కువ అంచనా వేయకు ఎక్సట్రా అని అనడంతో, అప్పుడు ప్రేమ్ ఎలా అయినా టాపిక్ డైవర్ట్ చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ప్రేమ్ చెయ్యి పట్టుకుని జ్వాలా మెడికల్ క్యాంపు లోకి తీసుకొని వెళుతుంది.
అక్కడికి వెళ్లి ఈ ఎక్స్ట్రా నేను ఇద్దరమూ బ్లెడ్ ఇస్తున్నాము అని చెప్పడంతో హిమ, నిరూపమ్ సంతోషంగా ఫీల్ అవుతారు. అప్పుడు జ్వాల డాక్టర్ సాబ్ మీరు నా దగ్గర బ్లడ్ తీసుకోండి, ఏయ్ తింగరి నువ్వు ఈ ఎక్సట్రా దగ్గర బ్లడ్ తీసుకో అని చెప్పి ప్రేమ్ చేతిని, హిమ చేతిని కలుపుతుంది. అప్పుడు ప్రేమ్ లోపల ఆనంద్ పడుతూ హిమ వెంట వెళ్తాడు.
ఆ తర్వాత హిమ బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేసినప్పటికీ సౌర్య ఆచూకీ తెలియలేదు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు నిరుపమ్ అక్కడికి వచ్చి ఓదారుస్తాడు. ఈ క్రమంలోనే నిరుపమ్, ప్రేమ్ లు జ్వాలా చేతికి ఉన్న పచ్చబొట్టును చూసి ఎవరూ అని అడుగుతారు. ఇక వారి మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. జ్వాలానే హిమ అని మనసులో అనుకుంటుంది.
పచ్చబొట్టు ఎవరి పేరు అని నిరుపమ్ అడగగా నా శత్రువు పేరు అని అనడంతో హిమ ఒక్కసారిగా బాధపడుతుంది. ఆ మాటలు అన్నీ చాటుగా విన్న హిమ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని అనుకుంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.