Intinti Gruhalakshmi Aug 17 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుస్తుంది. గత ఎపిసోడ్ లో తులసి ని బీచ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటాడు సామ్రాట్.
ఈరోజు ఎపిసోడ్ లో తులసి గది బయట సామ్రాట్ ఎదురుచూస్తూ ఉండగా ఇంతలో నందు, లాస్య అక్కడికి వచ్చి దొంగ చాటుగా ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటారు. ఇంతలోనే తులసి బయటికి రావడంతో రూమ్ లో బోర్ కొడుతోంది అలా బయటకు వెళ్దాం అని అనగా ఆ మాట విన్నా నందు తన మనసులో వద్దు అని చెబుతుంది అని అనుకుంటూ ఉండగా తులసి సరే అనడంతో నందు షాక్ అవుతాడు.
అప్పుడు నీకు ఇష్టమైతేనే రండి అని అనటంతో వస్తాను అనగా సామ్రాట్ సంతోషంతో సరే అని అంటాడు. ఆ తర్వాత తులసి రెడీ అయి కిందికి వెళ్ళగా ఇంతలో సామ్రాట్ ఆటోలో కూర్చుని ఎదురుచూస్తూ ఉంటాడు. మరొకవైపు ప్రేమ్ కోసం అంకిత ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే ప్రేమ ఒక్కటే రావడంతో ఏంటి శృతి రాలేదా అని అంకిత అడగగా రాలేదు ఇక ఈరోజుతో నాకు శృతికి సంబంధం తెగిపోయింది అంటూ ప్రేమ్ జరిగింది మొత్తం వివరించడంతో అంకిత బాధపడుతూ షాక్ అవుతుంది.
మరొకవైపు తులసి, సామ్రాట్ తో కలసి ఎక్కడికి వెళ్తున్నాము అని అనగా చెప్పను సర్ప్రైజ్ ఇస్తాను అని అంటాడు సామ్రాట్. ఆ తర్వాత తులసి నందు ఇద్దరు కలిసి బీచ్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు సామ్రాట్ తులసిని బీచ్ దగ్గరికి వెళ్లే వరకు కళ్ళు మూసి అక్కడికి వెళ్ళగానే సర్ప్రైజ్ ఇవ్వడంతో గంతులు వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత పరంధామయ్య కు ఫోన్ చేసి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను మామయ్య అంటూ ఫోన్లోనే సంతోషపడుతుంది.
అది చూసిన సామ్రాట్ మరింత సంతోష పడుతూ ఉంటాడు. ఆ తర్వాత సామ్రాట్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా తులసి నీళ్లలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే బీచ్ లో ఉన్న వారందరూ పరిగెడుతూ ఉండగా అప్పుడు నందు ఏం జరిగింది అని అడగడంతో ఒక ఆవిడ నీళ్లలో కొట్టుకుపోయింది అనగా తులసి అని భయపడిన సామ్రాట్ తులసి కోసం నీళ్లలోకి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడున్న వారు అడ్డుకుంటారు.
ఆ తర్వాత తులసి అంటూ గట్టిగా అరుస్తాడు సామ్రాట్. ఇక రేపటి ఎపిసోడ్ లో నందు సామ్రాట్ కి తులసి విషయంలో నీ లిమిట్స్ లో నువ్వు ఉంటే బాగుంటుంది అని అనగా అది చెప్పడానికి నీకు ఏం సంబంధం ఉంది అనడంతో వెంటనే నందు నేను తులసి మాజీ భర్తని అని అంటాడు. అప్పుడు వెంటనే సామ్రాట్ ఓహో తులసి గారిని హింసించి విడాకుల వరకు తీసుకువచ్చిన ఇడియట్ నువ్వేనా అని అనగా ఎవడ్రా ఇడియట్ అంటూ నందు, సామ్రాట్ కాలర్ పట్టుకుని సామ్రాట్ ని నూకేస్తాడు. అది చూసిన తులసి లాస్య టెన్షన్ పడుతూ ఉంటారు.
Read Also : Intinti Gruhalakshmi Aug 16 Today Episode : ప్రేమ్, శృతి మధ్య చిచ్చు పెట్టిన.. సంతోషంలో తులసి..?
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.