tristyn lee body builder
Trending Video : ప్రతి ఒక్కరికీ అనుకున్నది సాధించాలని ఉంటుంది. అయితే అందరూ అనుకున్నది సాధించ లేరు. సాధించాలి, గెలవాలి అని అనుకుంటే సరిపోదు. దానికి తగ్గ కృషి కూడా ఉండాలి. అయితే ప్రతి ఒక్కరు తమలోని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. కలలు కంటే సరిపోదు… వాటిని నెరవేర్చుకునే సత్తా కూడా ఉండాలి. అయితే మనలో చాలా మంది కలలు కనడం వరకు మాత్రం లోటు లేకుండా చేసేస్తారు. ఆ తర్వాత అసలు విషయానికొచ్చేసరికి ముఖం చాటేస్తారు లేదంటే సాకులు వెతుక్కుంటారు.
అందుకే అద్భుతాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. సాధారణంగా టీనేజ్ యువత సినిమాలు, షికార్లంటూ… ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడంటూ కాలాన్ని వృధా చేస్తుంటారు. అయితే రొటీన్ కు భిన్నంగా ఈ టీనేజ్ కుర్రాడు (tristyn-lee) మాత్రం కసరత్తులు చేసి కండలు పెంచేశాడు. ఈ యంగ్ బాడీ బిల్డర్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అతను ఎవరు, ఆ స్టోరీ ఏంటో మీకోసం…
అమెరికాకు చెందిన ట్రిస్టిన్ లీ 15 ఏళ్ల వయసులో ఫుడ్ బాల్ ప్లేయర్ కావాలనుకున్నాడు. నిజానికి ట్రిస్టిన్ లీ (tristyn-lee) పొట్టిగా ఉంటాడు. దీంతో అందరూ అతన్ని ఆట పట్టిస్తూ ఉండేవారు. ఐతే లీ మాత్రం తనను చూసి నవ్విన వారికి గట్టి సమాధానం ఇవ్వాలనుకున్నాడు. ఆ చిన్న మలుపు లీని ఫ్రొఫెషనల్ బాడీ బిల్డర్ గా నిలబెట్టింది. ఐదేళ్లు కఠోర శ్రమ పడి బాడీ బిల్డర్ అయ్యాడు… తన బలహీనతను బలంగా మార్చుకున్నాడు.
అంతేకాదు నేడు ప్రపంచ వ్యాప్తంగా అతని పేరు మారుమోగిపోతోంది. లీ 15 నుంచి 19 ఏళ్ల మధ్య అతని శరీరాన్ని ఏ విధంగా ఇనుములా మార్చాడో తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. నిజానికి లీ కొన్ని సంవత్సరాల క్రితం పిన్న బాడీబిల్డర్ గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు కూడా. ప్రస్తుతం లీకి 19 ఏళ్లు ఉండగా అతని ఫిట్ నెస్ వీడియోను చూసిన యావత్తు ప్రపంచం ప్రశంసల్లో ముంచెత్తుతోంది.
Read Also : ఈ యోగ ముద్రలతో ఆరోగ్యప్రయోజనాలెన్నో..
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.