july 14 Today Episode Swapna and Shoba get worried about Nirupam and Hima's wedding in todays karthika deepam serial episode
Karthika Deepam july 14 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌర్యకీ హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొని వెళ్తారు. ఈరోజు ఎపిసోడ్ లో సౌర్య ఇంటికి వచ్చినందుకు సౌందర్య, ఆనందరావు లు ఆనందపడుతూ ఉంటారు. ఇంతలోనే సౌర్య హిమ, సౌర్య కలిసి దిగిన ఫోటోను చూసి వాళ్ళపై ఫైర్ అవుతుంది. ఆ ఫోటోని విసిరేస్తూ ఉండగా ఇంతలో నిరుపమ్ వచ్చి ఆ ఫోటోని పడిపోకుండా పట్టుకొని ఆ ఫోటోని సౌందర్య చేతికి ఇచ్చి సౌర్య చేయి పట్టుకొని పిలుచుకుని వెళ్తాడు.
అప్పుడు సౌందర్య వాళ్ళు ఎందుకు సౌర్య ని నిరుపమ్ పిలుచుకొని వెళ్తున్నాడు అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటారు. మరొకవైపు నిరుపమ్,సౌర్య ఇద్దరు కలిసి బయట మాట్లాడుతుంటారు. అప్పుడు నిరుపమ్ అందరూ ఉండి కూడా బయటికి చెప్పకుండా ఎందుకు ఇలా ఒంటరిగా బతుకుతున్నావ్ అని అడుగుతాడు.
అప్పుడు సౌర్య ఎమోషనల్ గా మాట్లాడి వెళ్ళిపోతుంది. మరొకవైపు ప్రేమ్ రావడంతో అప్పుడు స్వప్న నీకు మీ డాడీకి ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదు. నిరుపమ్ పెళ్లి జరుగుతోంది మీరు చూస్తే ఏమీ పట్టనట్లు ఉన్నారు అని అడుగుతుంది. అంతేకాదు ఆ హిమ నాకు పెళ్లి వద్దు అని అంటుంటే నిరుపమ్ మాత్రం హిమనే కావాలి అని అంటున్నాడు అని బాధపడుతుంది స్వప్న.
మరొకవైపు సౌందర్య, సౌర్య ని అందంగా రెడీ చేసి చూసి మురిసి పోతూ ఉంటుంది. ఆ తరువాత ఆనంద్ రావ్,హిమ జ్వాలాని చీరలో చూసి మురిసిపోతూ ఉంటారు. ఆ తరువత స్వప్న,శోభ ఇద్దరు కలిసి నిరుపమ్ పెళ్లి గురించి టెన్షన్ పడుతూ వుంటుంది. అప్పడు స్వప్న నిరుపమ్ ప్రవర్తన ఏంటో నాకు అర్థం కావడం లేదు శోభతో అంటుంది. అప్పుడు శోభ మాత్రం సౌందర్య,సౌర్య సంగతి చూస్తాను అని స్వప్నతో అంటుంది.
మరొకవైపు భోజనం చేస్తూ ఉండగా అప్పుడు సౌందర్య,సౌర్య నీకు ఏం కావాలో అడుగు చేసి పెడతాను అని అనగా అప్పుడు వెంటనే సౌర్య నాకు మా నాన్న కావాలి,డాక్టర్ సాబ్ కావాలి అని అనడంతో సౌందర్యం మౌనంగా ఉండిపోతుంది. ఇంతలోనే హిమ అక్కడికి రావడంతో సౌందర్య వాళ్ళు తినడానికి ఎంత పిలిచినా కూడా రాదు. ఇప్పుడు సౌర్య రమ్మని పిలవడంతో హిమ ఆశ్చర్య పోతుంది.
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.