Soundarya and her family welcome Sourya to their house in todays karthika deepam serial episode
Karthika Deepam july 13 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ డ్ లో సౌర్య ఇంటికి రావడంతో సౌందర్య కుటుంబం అందరూ సంతోష పడుతూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో ఇంద్రమ్మ కు కడుపునొప్పి రావడంతో హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. అక్కడ ఇంద్రుడు టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడు జ్వాలా ధైర్యం చెబుతుంది. ఆ తర్వాత ఇంద్రమ్మ ను బయటికి తీసుకుని రాగా ట్రీట్మెంట్ చేసింది హిమ అని తెలియడంతో జ్వాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తరువాత హిమపై సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా హిమ వెళ్లి సౌర్య చేయి పట్టుకుంటుంది.
అప్పుడు సౌర్య, హిమ చేతిపై ఉన్న పచ్చబొట్టును చూసి షాక్ అవుతుంది. అప్పుడు అందరూ చూస్తుండగానే అందరి ముందు హిమను అవమానిస్తుంది సౌర్య. అప్పుడు హిమ అసలు విషయం చెప్పడానికి ఎంత ప్రయత్నించినా కూడా సౌర్య అసలు వినిపించుకోదు. అప్పుడు శోభ చెప్పిన మాటల గురించి మాటలు నమ్మకు అని హిమ ఎంత చెప్పినా కూడా వినిపించుకోదు సౌర్య.
అప్పుడు సౌందర్య జ్వాలా,సౌర్య ఇద్దరు ఒకటే అని చెప్పడంతో స్వప్న షాక్ అవుతుంది. అప్పుడు స్వప్న, సౌర్య,హిమలకు తన ఇంటి కోడలు అయ్యే అదృష్టం లేదు అని సౌందర్య దంపతులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది స్వప్న. మరొకవైపు ప్రేమ్ హిమ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. మరోవైపు నిరుపమ్ భోజనం చేస్తూ తన పెళ్లి గురించి హిమ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉండగా స్వప్న అసలు విషయాన్నీ చెప్పలేక తనలో తానే మదన పడుతూ ఉంటుంది.
అప్పుడు నిరుపమ్ తన పెళ్లి గురించి మాట్లాడగా స్వప్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు స్వప్న ఆ జ్వాలా ఎవరో కాదు సౌర్య నే అని అనడంతో నిరుపమ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత మరొకవైపు సౌందర్య కుటుంబం సౌర్య కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతలోనే సౌర్య ఆటో లగేజీ తీసుకొని రావడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత సౌర్య కీ హారతి ఇచ్చి లోపలికి పిలుస్తారు. అప్పుడు ఆనంద్ రావ్ ఆనందంతో సౌర్య ని లోపలికి పిలుచుకొని వెళ్తాడు.
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.