...

Sitara ghattamaneni: గుర్రపు స్వారీ చేస్తున్న సితార.. అదిరిపోయిందమ్మా అంటూ కామెంట్లు!

Sitara ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతరు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నమ్రత, మహేష్ ల ముద్దు కూతురు తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. కొత్త కొత్త పాటలకు డ్యాన్స్ చేస్తూ.. ఏవైనా ట్రిప్పులకు వెళ్లినప్పుడు దిగిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె గుర్రపు స్వారీ చేసింది.

సితార ఘట్టమనేని తాజాగా గుర్రపు స్వారీ చేసింది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. అందులో చిల్లీ, బీటా అనే రెండు అత్యంత అందమైన, బలమైన గుర్రాలపై తన ట్రైనర్స్ గుర్రపు స్వారీ నేర్పించారని వివరించింది. అలాగే తన ట్రైయినర్స్ కి థాంక్యూ కూడా చెప్పింది. అయితే ఈ వీడియోను అబిమానులతో పంచుకునేందుకు చాలా ఆసక్తిగా ఉందంటూ వివరించింది.