samantha-comments-samantha-interesting-comments-on-telugu-top-hero
సోషల్ మీడియాలో ఉన్న ట్రెండింగ్స్‌లో మొదటి వరుసలో ఉంటుంది సమంత. ఇందుకు కారణం నాగచైతన్యతో విడాకులు తీసుకోవడమే.. ఈ విషయం ముగిసి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా.. సోషల్ మీడియాలో ఏదో ఒక సందర్భంగా ఈ అంశం ట్రెండింగ్ లోకి వస్తోంది. ఇక నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత తన దృష్టినంతా సినీ కెరీర్ పైనే పెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్స్ జాబితాలో మొదటి వరుసలో ఉన్న ఈ అమ్మడు.. తాజాగా బాలీవుడ్, హాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం చేసి నిండ సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ.
ఇదిలా ఉండగా తాజాగా రోష్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకియాట్రి ఎట్ యువర్ డోర్ స్టెప్ అనే ప్రోగ్రాంలో పాల్గొన్న సమయంలో కొన్ని విషయాలను పంచుకుంది. తన జీవితంలో చాలా మానసిక ఒత్తిడును ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. ఇలాంటి సమయంలో డాక్టర్లను, స్నేహితుల సహాయం తీసుకున్నట్టు వెల్లడించింది. తాను ఈ రోజు ఇలా ధైర్యంగా నిలబడటానికి కారణం డాక్టర్లు, కౌన్సెలర్స్, ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది. వారందరికీ థ్యాంక్స్ చెప్పింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది సమంత. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ హిట్ కొట్టింది. ఈ మూవీలో సమంత యాక్ట్ చేసిన ఐటమ్ సాంగ్ ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా.. యూత్ ను ఓ ఊపు ఊపింది. యూట్యూబ్ లోనూ ఈ పాట ఎన్నో రికార్డులను సృష్టించింది. ఈ సాంగ్ వీడియోను ఇటీవలే రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం.
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.