Rukmini feels helpless as Madhava misleads Devi in todays devatha serial episode
Devatha Aug 27 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే కట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో మాధవ నీ జానకి నిలదీస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో జానకి, మాధవనీ నిలదీస్తూ చిన్మయిని కాదని దేవిని మాత్రమే ఎక్కడికి తీసుకెళ్లావు అని గట్టిగా అడగగా మాధవ అబద్ధం చెప్పడంతో వెంటనే జానకి పసిగట్టి మాధవని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. మీ నాన్న ఈ ఊరి ప్రెసిడెంట్ ఏదైనా తప్పు జరిగితే మీ నాన్న తలదించుకుంటాడు జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది జానకి. మరొకవైపు దేవి, తన తండ్రి అని చెప్పిన వ్యక్తి గురించి బాధపడుతూ ఉంటుంది.
అప్పుడు రాధ అక్కడికి భోజనం తినిపించడానికి వచ్చినా కూడా దేవి అన్నం తినకుండా ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు రాదా ఇంత అడిగినా కూడా దేవి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. మరొకవైపు ఆదిత్య కూడా జరిగిన విషయాలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య ఎలా అయిన దేవికి నిజం చెప్పాలి అని అనుకుంటాడు.
ఆ తర్వాత కమలా కూతురు ఏడవడంతో సత్య అక్కడికి వెళుతుంది. అప్పుడు సత్య తనకి రాధకి జరిగిన పెళ్లి ఫోటోని తీసుకుని ఎలా అయినా ఈరోజు దేవికి నిజం చెప్పాలి అని అనుకుంటాడు. అప్పుడు రాధ కి ఫోన్ చేసి ఈ రోజు నేనే దేవికి తండ్రిని అన్న విషయాన్ని చెప్పేస్తాను అనడంతో రాధ సంతోషపడుతుంది.
ఆ తర్వాత రాదను దేవిని తీసుకుని ఆఫీస్ దగ్గరికి రమ్మని చెబుతాడు. ఆ తర్వాత రాధ ఒంటరిగా కూర్చుని దేవికి ఎలా అయినా మాధవ కుట్ర గురించి చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రాదా దేవి దగ్గరికి వచ్చి నీకు ఓ విషయం చెప్పాలి అని దేవుని తీసుకొని వెళుతుంది. అప్పుడు దేవి రాధను తీసుకొని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళుతుంది చూడు అమ్మ నాన్న ఎలా ఉన్నాడు అనడంతో రాధా సాక్ అవుతుంది.
అప్పుడు ఈయనే మీ నాయన ఎవరు చెప్పారు అని రాధ కోపంతో అడుగుతుంది. అప్పుడు దేవి ఫోటోలు పట్టుకుని తిరుగుతున్నాడు నువ్వు చెప్పిన లక్షణాలు కూడా ఉన్నాయి అనడంతో అప్పుడు రాధ,మాధవ పై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు ఆదిత్య వారి పెళ్లి ఫోటోను చూసుకొని మురిసిపోతూ ఉంటాడు. ఈరోజు దేవికి ఎలా నిజం చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు రాధ ఎలా అయినా ఈరోజు మాధవ పని చెప్పాలి అని అక్కడ నుంచి దేవుని తీసుకుని వెళుతుంది.
Read Also : Devatha Aug 25 Today Episode : ఆదిత్య కు మాట ఇచ్చినరాధ.. సంతోషంలో దేవి..?
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.