Kota Srinivasa Rao praises Babu Mohan
Kota Srinivasa Rao : వెండితెరపై ఎంతోమంది కమెడియన్స్ నవ్వుల పువ్వులు పూయింస్తుంటారు. ఆనాడు రేలంగి, రాజబాబు నుంచి నేడు బ్రహ్మానందం, వెన్నెకిషోర్ వరకు ఆడియెన్స్‌ను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తూనే ఉన్నారు. అయితే, కొందరు కమెడియన్స్ నటించిన ఫన్నీ సీన్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. వాటిని ఇప్పుడు చూసిన నవ్వు ఆపుకోలేకుండా ఉండలేమంటే అతిశయోక్తి కాదు.
కామెడీ ప్రపంచంలో ఆ సన్నివేశాలు ఎవర్ గ్రీన్‌లా నిలిపోతాయి. ‘మామగారు’ సినిమాలో బాబుమోహన్, కోట శ్రీనివాసరావు చేసిన కామెడీ కూడా ఈ కోవలోకి వస్తుంది. బిక్షగాడి వేశంలో బాబుమోహన్, అత్తింట్లో సెటిల్ అయిన అల్లుడి క్యారెక్టర్‌లో వీరిద్దరూ ఆ పాత్రలకు న్యాయం చేశారు. మూవీ మధ్యమధ్యలో వచ్చే వీరిద్దరి కామెడీ ఆ చిత్రానికే హైలెట్‌గా నిలుస్తుంది. ఆ చిత్రం ఘన విజయం సాధించడంలోనూ వీరిద్దరి కృషి ఉందని చెప్పవచ్చు.
ఇటీవల కోట శ్రీనివాస రావు ‘ఆలీతో సరదాగా’ అనే షో ద్వారా తామిద్దరి మధ్య ఎటువంటి బాండింగ్ ఉన్నదనే విషయాన్ని వెల్లడించారు పెద్దాయన. బాబుమోహన్, నేను మొదట ‘బొబ్బిలి రాజా’ మూవీ చేశాము. అనుకోకుండా మేము ఇద్దరం ‘బొబ్బిలి రాజా’ చిత్రంతో స్క్రీన్ షేర్ చేసుకున్నాం. ఆ తర్వాత వచ్చిన ‘మామగారు’ మూవీ మా ఇద్దరి కెరీర్‌లో ఓ మలుపు తీసుకొచ్చిందన్నారు.
బాబుమోహన్ ఓ మంచి యాక్టర్ మాత్రమే కాదు.. పెక్యులర్ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అని పొగడ్తల వర్షం కురిపించారు కోట.. అయితే, మామగారు సనిమా షూటింగ్ టైంలో ‘నేను వాడిని తన్నే సీన్స్ చూసి అందరూ నిజంగానే తన్నాడా.. అని’ అనుకుంటారు.. సినిమా మొత్తంలో అలాంటి తన్నే సీన్స్ చాలా ఉంంటాయి. అన్ని దెబ్బలు బాబుమోహన్ ఎలా భరించాడని చాలా మంది అనుకుంటారు. కానీ అదంతా వాడి గ్రేట్‌నెస్ అని చెప్పా్రు పెద్దాయన..
నేను వాడిని తన్నే సీన్ ప్రారంభంలో.. జస్ట్ నా కాలితో టచ్ చేయగానే వాడు వెళ్లి కింద పడిపోయేవాడు. అంత టైమింగ్ ఉన్న యాక్టర్ బాబు మోహన్. ఆ రోజు వాడు అలా మేనేజ్ చేసి ఉండకపోతే నేను నిజంగానే తన్నాల్సిన సీన్స్ పెట్టేవారు. అదే నిజంగా జరిగితే అప్పుడు అందరూ నన్ను తిట్టుకోవాల్సి వచ్చేదని గుర్తుచేశారు కోట శ్రీనివాస్ రావు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు బెస్ట్ యాక్టర్. ఆ తర్వాత తామిద్దరం 60 నుంచి 70 సన్నివేశాల్లో నటించాం.. ఒక్కోసారి ఇద్దరం కలిసి ప్రయాణాలు కూడా చేసేవారమని చెప్పుకొచ్చారు.
Chiranjeevi : చిరుతో సాయిధరమ్ తేజ్ వాళ్ల నాన్న ఓ సూపర్ హిట్ నిర్మించాడని మీకు తెలుసా..!
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.