Karthika Deepam 24 Sep Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దీప తన అత్తయ్య మామయ్య వచ్చారు అని తెలుసుకుని ఆనందపడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య,ఆనంద్ రావ్ లు కార్ లో వెళ్తూ ఉండగా అప్పుడు సౌందర్య జరిగిన విషయాల గురించి ఆనందరావుతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు సౌందర్య ఆ మోనిత మీద నాకెందుకు అనుమానంగా ఉంది అని అంటుంది. కానీ ఆనందరావు మాత్రం సౌందర్య మాటలను కొట్టి పారేస్తూ ఉంటాడు.
మరొకవైపు మోనిత ఏదో పని చేసుకుంటూ ఉండగా అక్కడికి శివ వచ్చి ఇందాక వచ్చిన వాళ్ళు సార్ వాళ్ళ అమ్మానాన్న నా మేడమ్ అని అడగగా మోనిత శివ పై సీరియస్ అవుతుంది. ఇందులోనే కార్తీక్ అక్కడికి వచ్చి వాళ్ళు ఎవరు అని అడగగా శివ వాళ్ళ అమ్మానాన్న అంటూ ప్లేట్ ఫిరాయిస్తుంది మోనిత. మరొకవైపు దీప జరిగిన విషయాలు అన్నీ వాళ్ళ డాక్టర్ అన్నయ్యకి చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది.
ఆయనకి నామీద ఇంకా కోపం ఎక్కువయింది అని వాళ్ళ అన్నయ్యతో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది దీప. అప్పుడు అతను అవన్నీ మర్చిపోయి మీ భర్తకు ఎలా గతం గుర్తుకు తీసుకురావాలో అది ఆలోచించు అని అంటాడు. కానీ మోనిత చేసిన పనికి దీప నిరాశతో మాట్లాడుతూ ఉండగా వాళ్ళ డాక్టర్ అన్నయ్య మాత్రం ధైర్యం చెబుతూ ఉంటాడు.
ఇంతలోనే అక్కడికి కాలనీ ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చి నువ్వు వంటలు చేస్తావంటే కదా రేపు వంటలు చేయడానికి దీప ని రమ్మని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు హిమ, సౌర్య మాట్లాడుకుంటూ ఉండగా సౌర్య మాత్రం నువ్వు ఇక్కడ సెట్ కావు వెళ్లిపో అని అంటుంది. కానీ హిమా మాత్రం నేను వెళ్ళను సౌర్య నీ దగ్గరే ఉంటాను అని అంటుంది.
ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ సౌర్య ఎంత చెప్పినా వినిపించుకోకుండా హిమ ఇక్కడే ఉంటాను అని అంటుంది. మరొకవైపు కార్తీక్ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో మోనిత అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని అనడంతో కార్తీక్ ఆ వంటలక్క నన్ను డిస్టర్బ్ చేస్తోంది అని అంటాడు. అప్పుడు మోనిత కావాలనే దీప మీద లేనిపోని మాటలు అని చెప్పి కార్తీక్ ని మరింత రెచ్చగొడుతుంది.
అప్పుడు మోనిత మనం దూరంగా వెళ్లిపోదాం అనటంతో కార్తీక్ అందుకు ఒప్పుకోడు. అప్పుడు దీప మనల్ని వదిలి వెళ్ళిపోయేలా చేయాలి అని కోపంతో మాట్లాడుతాడు. ఆ తర్వాత దీప ఎక్కడికో బయలుదేరుతూ ఉండగా ఇంతలో అక్కడికి వెళ్లిన కార్తీక్ అసలు తలుపు తీయండి మీతో మాట్లాడాలి అని కోపంగా మాట్లాడుతాడు. అప్పుడు కార్తీక్ నేను మీకు ఒక విషయం గట్టిగా చెప్పడానికి వచ్చాను నా భార్య పేరు మోనిత అని అనడంతో దీప షాక్ అవుతుంది.
అప్పుడు మీరు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండండి చాలామంది మీరు డబ్బు కోసం అలా చేస్తున్నారు అంటున్నారు కానీ మిమ్మల్ని చూస్తే అలా అనిపించడం లేదు అంటూ కార్తీక్ కోపంగా మాట్లాడుతుండగా దీప ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు కార్తీక్ దీప కోసం డబ్బులు తీసుకుని వచ్చి ఆ డబ్బులు సరిపోకపోతే చెప్పండి ఇంకా డబ్బులు ఇస్తాను అని అంటాడు. కానీ నన్ను మాత్రం వదిలి వెళ్ళిపోండి మీకు దండం పెడతాను అనగా ఆ మాటలు విన్న మోనిత సంతోషపడుతూ ఉంటుంది.
సహనం కోపంగా మారకముందే మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ దీప కు వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. మరోవైపు మోనిత దేవుడికి థాంక్స్ చెబుతూ ఆనందపడుతూ ఉంటుంది. కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా దీప ఆగండి అని చెప్పి ఆ డబ్బు చూపించడంతో వద్దు అని అంటాడు కార్తీక్ వెంటనే దీప నా మొగుడు నాకు ఇచ్చిన డబ్బులు నేను ఎందుకు తిరిగి ఇస్తాను అనడంతో మోనిత, కార్తీక్ ఇద్దరు షాక్ అవుతారు.
మీది ఇచ్చిన డబ్బులతో మీకు నచ్చే చీర కొనుక్కుంటాను మీకు నచ్చిన నగలే వేసుకుంటాను అని అనడంతో కార్తీక్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ కోపంతో దీపను కొట్టబోతుండగా ఇందులో మోనిత వచ్చి అడ్డుపడుతుంది. మరొకవైపు సౌందర్య ఆనంద్ రావ్ లు ఆలోచిస్తూ ఉండగా అప్పుడు సౌందర్య తనని తానే తిట్టుకుంటూ నేను పిల్లల విషయంలో ఎందుకు ఏమి చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటుంది.
ఆ తర్వాత దీప దేవుడికి ఈరోజు నేను ఒక పెద్ద సాహసం చేయబోతున్నాను అందుకు నాకు నీ దీవెనలు ఉండాలి అనే మొక్కుకుంటూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో దీప వంటలు చేసే దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న వారికి ఒక కథను వినిపిస్తుంది. అప్పుడు వాళ్ళు అందులో మెయిన్ పాత్ర నువ్వే పోషించాలి అనడంతో దీప కార్తీక్ దగ్గరికి వెళ్లి మీరు నాతో పాటు రావాలి అని అంటుంది. అప్పుడు నీ భర్త ఎవరు వంటలక్క అని అనగా ఈరోజు నేను వేసే నాటకం చూడండి నా భర్త ఎవరో మీకే తెలుస్తుంది అని ఉంటుంది. దాంతో కార్తీక్ సరే వస్తాను అని అంటాడు.
Read Also : Guppedantha Manasu: రిషి మాటలకు షాక్ అయిన దేవయాని.. దగ్గరవుతున్న వసు, రిషి..?
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.