Geetu royal : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వారికి గలాటా గీతు పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. అలాగే జబర్దస్త్ వంటి షోలు చూసే వారికి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అయితే ముందుగా టిక్ టాక్ వీడియోలు.. తర్వాత బిగ్ బాస్ రివ్యూలతో మరింత ఫేమస్ అయింది. చిత్తూరు యాసలో గలగలా మాట్లాడుతూ గలాటా గీతూగూ పేరు తెచ్చుకుంది. అయితే తాజాగా ఆమె ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తనకు ఇష్టమైన హీరో.. కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్లు చేసింది.
తనకు హీరో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అని గీతూ వివరించింది. అలాగే తనకు ఇటీవలే ఓ చేదు అనుభవం ఎదురైందని చెప్పింది. ఆస్ట్రేలియాల ఒక ఈవెంట్ ఉంది, దానికి హోస్ట్ చేయాలని అడిగారట. తనకు యాంకరింగ్ ఇష్టం కావడంతో ఓకే చెప్పిందట. అలాగే అక్కడ షఆపింగ్ చేయొచ్చు.. భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకొవచ్చని అనకుందట. అడిగిన డబ్బులకు వాళ్లు కూడా ఓకే చెప్పారట. కరెక్ట్ గా టికెట్ బుస్ చేసే సమయంలో మేనేజర్ పీఏ ఫోన్ చేసి పర్సనల్ గా ఓకే కదా అన్నారట… తనకు పర్సనల్ అసిస్టెంట్ అనుకొని గీతూ ఓకే కూడా చెప్పిందట.
కానీ అతడు అతని మేనేజర్ తో కలిసి ఉండాలని చెప్పడంతో చాలా భయపడిపోయిందట. వెంటనే నో చెప్పి ఫోన్ పెట్టేసిందట. ఆ తర్వాత అతను చాలా సార్లు ఫోన్ చేసి అలా ఏం వద్దులెండి.. జస్ట్ హోస్టింగ్ కోసం రండి అని చెప్పినా ఆమెకు భయం వేసి ఆస్ట్రేలియా వెళ్లడమే మానేసిందట.
Read Also : Jabardasth: జబర్దస్త్ కమెడియన్ గీతూ రెమ్యునరేషన్ అంత ఉంటుందా..?