Devatha serial September 14 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో రాధ, చిన్మయికి అసలు విషయం చెప్పడంతో షాక్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో చిన్మయి ఎమోషనల్ అవుతూ వద్దమ్మా నన్ను విడిచి వెళ్ళిపోవద్దు అని ఏడుస్తూ ఉంటుంది. రాధ కూడా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. కావాలంటే నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళు నువ్వు లేకుండా నేను ఉండలేను అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది చిన్మయి. అప్పుడు చిన్మయి మాటలకు రాధ ఏం మాట్లాడకుండా మరింత ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
నిన్ను విడిచి పెట్టే వెళ్లాలని నాకు అనిపించలేదు బిడ్డ అంటూ ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఎవరికీ చెప్పను అని మాట ఇవ్వు అంటూ చిన్మయిని మాట అడుగుతుంది. అప్పుడు చిన్మయి కూడా మాట ఇస్తుంది. అప్పుడు చిన్మయి నువ్వు చెల్లెలు లేకుండా నేను ఉండలేను అమ్మ అంటూ మళ్ళీ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరుసటి ఉదయాన్నే మాధవ జరిగిన విషయాలు తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
ఇక జానకి తెల్లవార్లు పడుకోకుండా అలాగే మేల్కొని ఉంటుంది. అప్పుడు ఉదయాన్నే సడన్గా లేచి ముందు రాధ ఉందో లేదో చూడాలి అని రాధ గది దగ్గరికి వెళ్తుంది. అప్పుడు జానకి రాధా కోసం ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది. మరొకవైపు మాధవ రాధ ఆదిత్యను ఎలా అయినా బాధపెట్టాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే జానకి అక్కడికి వచ్చి రాధ కనిపించలేదు అనడంతో మాధవ షాక్ అవుతాడు.
ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని నాతో చెప్పింది అనడంతో మాధవ షాక్ అవుతాడు. అప్పుడు జానకి జరిగింది మొత్తం మాధవకి వివరిస్తుంది. అప్పుడు మాధవ, రాధా ఎక్కడికి వెళ్లి ఉంటుంది నిజంగానే వెళ్ళిందా లేదంటే నన్ను బెదిరించడానికి ఇలా వెళ్లిందా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. మరొకవైపు రాధ ఆదిత్య దగ్గరికి వెళ్లి నేను ఆ ఇంట్లో నుంచి రావడం లేదు అని అంటుంది.
అప్పుడు చిన్మయి కోసం రాలేకపోయాను పెనిమిటి అంటూ జరిగింది మొత్తం వివరిస్తుంది రాధ. దాంతో ఆదిత్య కూడా షాక్ అవుతాడు. అప్పుడు రాధ,ఆదిత్య ఏం చేయాలి అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. మరొకవైపు దేవుడమ్మ సత్య ఇద్దరు ఆదిత్య గురించి మాట్లాడుకుని బాధపడుతూ ఉంటారు. అప్పుడు దేవుడమ్మ ఆదిత్యతో ఒకసారి మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటుంది.
మరొకవైపు జానకి, రాధ కనిపించకపోయేసరికి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు దేవి అక్కడికి రావడం చూసి జానకమ్మ సంతోషపడుతుంది. రాధ గురించి జానకి ఆలోచిస్తూ ఉండగా రాధ రావడం చూసి జానకి సంతోషపడుతుంది. అప్పుడు జానకి రాధ తో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు మాధవ వింటూ ఉంటాడు. అప్పుడు మాధవ రాధ వైపు అలాగే చూస్తూ నవ్వుతూ ఉంటాడు.
మరొకవైపు సత్య ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇంతలో దేవుడమ్మ అక్కడికి వచ్చి ఏం జరిగింది సత్య ఎందుకు ఏడుస్తున్నావు అని అనగా అప్పుడు సత్య జరిగింది మొత్తం వివరించడంతో దేవుడుమ్మ షాక్ అవుతుంది. మరొకవైపు రాధ,దేవిని కరాటి పోటీకి వెళ్లడానికి రెడీ చేస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి చిన్మయి వచ్చి రాదని చూసి సంతోష పడుతూ ఉంటుంది.
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
ఉపేంద్ర నటించిన యూఐ ఎట్టకేలకు డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
CAT 2024 Results : అభ్యర్థుల స్కోర్‌కార్డులను పరీక్ష అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.inలో అప్‌లోడ్ చేసింది. క్యాట్ 2024 పరీక్షను…
This website uses cookies.