Singer revanth captain: ఈసారి బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మ్ చేస్తున్నారు. ఈవారం బిగ్ బాస్ బర్త్ డే అంట.. అందుకోసం బిగ్ బాస్ అడిగిన కోర్కెలను తీర్చారు. ఇప్పుడు మీ కోరికలను తెలుసుకోవాలనుకుంటూ కంటెస్టెంట్లకి చెప్పాపరు. దీంతో శ్రీహాన్.. హెల్పింగ్ హ్యాండ్స్ కు నా చేతులతో నేనేం సాయం చేయలేకుపోతున్నా. నా సిరి, నా ఫ్రెండ్స్ ఈ పని చేయాలంటూ కోరాడు.
అలాగే బాలాదిత్య తన కూతురుకు పేరు పెట్టాలని కోరాడు. ఆర్జే సూర్య తన తండ్రి గురించి చెప్పుకొని తనతో ఎక్కువ మాట్లాడితే బాగుంటుందని చెప్పాడు. ఇన ఇనయ వాళ్ల అమ్మని తల్చుకొని ఏడ్చేసింది. పింకీ కూడా భర్త రంగనాథ్ ఫొటోతో పాటు టీషర్టు పంపిస్తే… బాగుంటుందని బిగ్ బాస్ ను కోరింది.
గీతూ మరింత ఓవర్ యాక్షన్ చేస్తూ తన కుక్కల బొచ్చు పంపాలని కోరింది. ఆ తర్వాత ఆదిరెడ్డి తన కూతురు బర్త్ డేను బిగ్ బాస్ హౌస్ లో జరపాలని లేదా లేదా కనీసం తన కూతురు ఫొటో అయినా పంపాలన్నాడు. కాప్టెన్సీ టాస్క్ లో రేవంత్ గొడ్డలి నరుకుతుండగా.. గొడ్డలి గిరి సంచాలక్ గా ఉన్న ఇనయ పక్కనుచి దూసుకెళ్లింది. వెంట్రుక వాసిలో మిస్ అయింది. లేదంటే ఇనయ చనిపోయేదే. అయితే ఈ కెప్టెన్సీ పోరులో సింగర్ రేవంత్ గెలిచి ఇంటికి ఐదో కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది.