G
Telugu News » TV Serials » rammurthy janaki going to devudamma house in todays devatha serial episode
⚡ TV Serials, Latest, Topstory

Devatha: దేవుడమ్మ ఇంటికి వెళ్లిన రామ్మూర్తి దంపతులు..రాధ ప్లాన్ ఫెయిల్ అవ్వనుందా..?

Devatha: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Devatha: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. దేవిని ఆదిత్యకు ఇవ్వడానికి నేను ఒప్పుకోను అంటూ మాధవ తెగేసి చెబుతాడు.

ఈరోజు ఎపిసోడ్ లో దేవి రాధను గట్టిగా హత్తుకుని అమ్మ నిన్ను వదిలి ఎక్కడికి పోను,అవ్వ ని,తాత ని నాన్న ని వదిలి నేను ఎక్కడికి పోను అని అనడంతో రాధా ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరొకవైపు పక్కింటి పని మనిషి అయినా పానకం కి స్కూటీ నేర్పిస్తూ ఉంటాడు భాష.

Advertisement

వెనకాలే సూరి బురఖా వేసుకుని ఫాలో అవుతూ ఉంటాడు. ఇంతలో భాషా పూలు కొనడం కోసం ఒక పూల షాప్ దగ్గర ఆపడం చూసి వెనకే ఫాలో అవుతున్న సూరి కుళ్ళుకుంటూ ఉంటాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తరవాత బండి పంచర్ కావడంతో వెనకాలే సైకిల్ లో వస్తున్న సూరి ఏమయింది భాష అంటూ వెటకారంగా అడిగి తన సైకిల్ ను వేసుకుని రమ్మని చెప్పి సైకిల్ ఇస్తాడు.

నేను పానకం బండి పంచర్ వేయించుకొని వస్తాను నువ్వు వెళ్ళు అని సలహా ఇస్తాడు. అప్పుడు పానకం లేట్ అయితే ఊరుకోడు అని చెప్పి భాషా సైకిల్ ఎక్కి పోవడంతో సూరి లోలోపల కుమిలిపోతుంటారు. ఇక మరొకవైపు దేవి కనిపించడం లేదని చిన్మయి ఏడుస్తూ ఉంటుంది. రామ్మూర్తి కుటుంబం అందరూ కూడా దేవిని వెతికే పనిలో పడతారు.

ఇంతలో రామ్మూర్తి దేవి మామిడి పళ్ళు తీసుకుని రాగా అప్పుడు చిన్నయి ఎమోషనల్ గా వెళ్లి దేవిని పట్టుకొని ఏడుస్తుంది. నువ్వు కొద్దిసేపు కనిపించకపోతే నాకు ఎలానో ఉంది అని అంటుంది. అప్పుడు రామ్మూర్తి, జానకి రాధ దగ్గరికి వెళ్లి చూసావా అమ్మ అలాంటి వాళ్ళని నువ్వు ఎలా విడదీయాలి అనుకుంటున్నావు అని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రాధ మాత్రం దేవిని ఆదిత్య కు ఇస్తాను అని పట్టుబడుతుంది.

అప్పుడు రామ్మూర్తి జానకి లు కలిసి దేవుడమ్మ దగ్గరకు బయలుదేరగా రాధా అడ్డుపడుతుంది. రాధా ఎంత బ్రతిమలాడినా కూడా వినకుండా రామ్మూర్తి దంపతులు దేవుడు దగ్గరికి బయలుదేరుతారు. ఇంతలో రాధ ఆదిత్యకు జరిగినదంతా వివరిస్తుంది. అప్పుడు కారులో ఎక్కడికో బయల్దేరి వెళుతున్నా ఆదిత్య ఆమాటవిని ఒక్కసారిగా షాక్ అయిన బ్రేక్ వేస్తాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷adithyaDevathadevimadhavaradha
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు