G
Telugu News » TV Serials » monitha decides to leave her son in todays kartika deepam serial
⚡ TV Serials, Latest

Karthika Deepam: కొడుకును కాదనుకొని వెళ్లిపోయిన మోనిత.. గుండెలవిసేలా రోదిస్తున్న సౌందర్య..?

%excerpt%

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Karthika Deepam March 15th Today Episode : బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. కార్తీక్, దీప లకు సౌందర్య కుటుంబం పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. మరొకవైపు మోనిత కూడా కార్తీక్ ఫోటో కి పిండ ప్రదానం చేస్తూ ఉంటుంది. సౌందర్య కుటుంబం కార్తీక్ పిండాన్ని నదిలో వదులుతూ గుండెలవిసేలా రోదిస్తు ఉంటుంది.

మరొకవైపు మోనిత కార్తీక్ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత తన బాబుని, తనకున్న ఆస్తి అంతా లక్ష్మణ్ చేతిలో పెట్టి బస్తి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడుతుంది. తన బాబు ని కూడా వారికే ఇచ్చేసి ఆ డబ్బులతో తన బాబుని డాక్టర్ ని చేయమని చెబుతుంది.

Advertisement

అప్పుడు మోనిత ఏడ్చుకుంటూ తన బాబుని అరుణ చేతిలో పెట్టి ఎంతో నిరాశతో బాధతో అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరొకవైపు సౌందర్య కుటుంబం కార్తీక్ దీపం ల ఫోటోలు చూసి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటారు. సౌందర్య మాత్రం కార్తీక్ కార్తీక్ అంటూ ఆనందరావు ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది.

Karthika Deepam March 15th Today Episode

మరొకవైపు హైదరాబాద్ కు చేరుకున్న హిమ తన నానమ్మ కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి ఆనందంతో పరుగులు తీస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే చిక్ మంగళూరు లో జరిగిన విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది.

ఇంతలో సౌర్య వచ్చి హిమ ఫోటోని బయటకు విసిరేస్తుంది. అదే సమయంలో ఇంటికి తిరిగి వస్తున్న హిమ తన ఫోటోను చూసి ఆశ్చర్యపోతుంది. అది అమ్మానాన్నలను మింగేసే రాక్షసి అది నా కంటికి కనిపించే దానికి వీలు లేదు అంటూ సౌర్య అన్న మాటలు హిమ విని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Karthika Deepam: కోపంతో రగిలి పోతున్న శౌర్య.. హిమ పరిస్థితి ఏంటి..?

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷himakarthikkarthika deepamkarthika deepam Serialkarthika deepam telugu serialkarthika deepam vantalakkaMonithasoundaryasouryaVantalakka
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు