G
Telugu News » TV Serials » madhava question to radha in todays devatha serial episode
⚡ TV Serials, Latest, Topstory

Devatha: రాధను నిలదీసిన మాధవ.. ఆదిత్యను అడ్డుకుంటున్న సత్య..?

Devatha: తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం..

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Devatha: తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

రాధ, దేవి ని ఆదిత్య దగ్గరికి పంపించడానికి దేవినో ఒప్పిస్తూ ఉంటుంది. అయితే దేవి, రాధమాట్లాడుతున్న మాటలు అన్ని కూడా రూమ్ లో నుంచి మాధవ వింటాడు. రూమ్ లో నుంచి బయటకు వచ్చిన మాధవ రాధా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అంటూ నిలదీస్తాడు. అసలు ఈ ఆలోచన నీ మనసులో ఎందుకు వచ్చింది.

దేవికి ఇక్కడ ఏం తక్కువ అయింది అని ఆఫీసర్ దగ్గరికి పంపించాలి అనుకుంటున్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు రాధ మాట్లాడుతూ ఆఫీసర్ కి బిడ్డలు లేరు.. మీరందరూ కూడా దేవుడిగా భావించే ఆ ఆఫీసర్ నా బిడ్డను పెంచుకుంటా అని అడిగాడు. నేను కూడా దేవిని దత్తత ఇవ్వడానికి ఒప్పుకున్నాను అనురాధ అంటుంది.

అప్పుడు మాధవ ఆఫీసర్ కావాలి అనుకుంటే ఎంతో మంది పిల్లలు ఉన్నారు కానీ మన బిడ్డ ని ఎందుకు ఇవ్వాలి అని అడుగుతాడు. ఆఫీసర్ కి మన బిడ్డ దేవి ఏమౌతుందని ఇస్తావు అని మాధవ అడగగా.. అప్పుడు రాధ దేవి ఆ ఆఫీసర్ బిడ్డ అని గట్టిగా చెబుతోంది.

Advertisement

ఆ తర్వాత రాధ తను అన్న మాటను కవర్ చేసుకుంటుంది. మాధవ ఎన్ని చెప్పినా వినకుండా ఆ రాధ మాత్రం తన బిడ్డను ఆఫీసర్ కి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నట్టు చెబుతుంది. ఈ విషయంలో రాధ ని నిర్ణయం మార్చుకోమని మాధవా చెప్పగా ఈ మాటే ఫైనల్ చెబుతుంది రాద.

మరొకవైపు దేవి వాళ్ళ స్కూల్ అన్యువల్ డే ఫంక్షన్ కు ఆదిత్యను చీఫ్ గెస్ట్ గా పిలుస్తారు. ఫంక్షన్ కు వెళ్ళడానికి ఆదిత్య ఇద్దరు రెడీ అవుతూ ఉంటారు. కానీ సత్య మాత్రం ఆదిత్య ఫంక్షన్ కి వెళ్లడానికి ఇష్టపడదు. ఫంక్షన్ లో మళ్లీ దేవి ఆదిత్యను అందరి ముందు ఏదో ఒక మాట అంటుంది అవమాన పరుస్తుంది అని ఇంట్లో అందరి ముందు చెబుతుంది సత్య.

ఆదిత్య ముందే ఇలాంటివి అనుకొని భయపడకు వెళదాం పద అని ధైర్యం చెబుతాడు. నన్ను దేవి ఏమైనా తప్పుగా మాట్లాడితే అక్కడే రాధ ఉంటుంది కదా తానే చూసుకుంటుంది అని అంటారు ఆదిత్య. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷adithyaDevathadevimadhavaradhasathya
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు