G
Telugu News » TV Serials » intinti gruhalakshmi serial latest episode highlights 2
⚡ TV Serials, Latest, Topstory

Intinti gruhalakshmi: అభిని పోలీసులు అరెస్ట్​ చేస్తారా..? 16 ఫిబ్రవరి 2022 ఇంటింటి గృహలక్ష్మి సీరియల్​ హైలెట్స్​..!

Intinti gruhalakshmi: మధ్యతరగతి కుంటుంబ కష్టసుఖాలను ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ చూడాల్సిందే. మరి 16 ఫిబ్రవరి 2022, బుధవారం ఎపిసోడ్ 557 హైలైట్స్ ఏంటో చూసేద్దాం.  

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Intinti gruhalakshmi: మధ్యతరగతి కుంటుంబ కష్టసుఖాలు తెలియాలి అంటే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ చూడాల్సిందే మరి 16 ఫిబ్రవరి 2022, బుధవారం ఎపిసోడ్ 557 హైలైట్స్ ఏంటో చూసేద్దామా.. నీ మాటలు వింటుంటే సగం చచ్చిపోయినట్టు అనిపిస్తోంది అని అంకితతో అభి అంటాడు. మంచైనా చెడైనా.. కష్టమైనా.. సుఖమైనా నా తలనొప్పి నన్నే పడనీయండి. ఎవరి జాలి.. ఎవరి సానుభూతి నాకు అవసరం లేదు. నన్ను ఒంటరిగా వదిలేస్తే చాలు. మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు అభి.

Advertisement

మరోవైపు అభి ఏదో ప్రాబ్లమ్లో ఇరుక్కున్నాడు. ఎలా తెలుసుకోవాలని తులసి ఆలోచిస్తుంటుంది. ఇంతలో దివ్య వచ్చి ఏడుస్తుంది. ఏమైందమ్మా.. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది తులసి. దీంతో మామ్.. రేపో మాపో మనం రోడ్డు మీద పడబోతున్నామట కదా. ఈ ఇల్లు లాగేసుకుంటారట కదా అని ఏడుస్తూ చెబుతుంది దివ్య. ఎవరు చెప్పారమ్మా అని అడుగుతుంది తులసి. లాస్య ఆంటి ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతుంటే విన్నాను అంటుంది  దివ్య.

మరోవైపు అభి ఆలోచించుకుంటూ బైక్ మీద వెళ్తుంటాడు. ఏం చేయాలో అర్థం కాదు తనకు. ఇంతలో ఓ జ్యూస్ షాపు వద్ద మనోజ్ కనిపిస్తాడు అభికి. దీంతో వెంటనే మనోజ్ అంటూ తన దగ్గరికి వెళ్లబోతాడు. మనోజ్ దొరకకుండా పరిగెడతాడు. చివరకు మనోజ్​ను దొరికించుకొని అతడిపై దాడి చేస్తాడు. వదులురా అంటాడు మనోజ్. ఏంట్రా వదిలేది. నువ్వు మోసం చేసినప్పుడు నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది. అసలు నువ్వు నా ఫ్రెండ్ వేనా ఛీ.. అంటూ ముందుకు నెట్టేస్తాడు అభి.

దీంతో అక్కడే ఉన్న పగిలిన బీరు సీసా మనోజ్​కు గుచ్చుకొని ప్రాణం పోతుంది. దీంతో ఏం చేయాలో అభికి అర్థం కాక వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. అతడు పారిపోవడం అక్కడ ఉన్న ఓ మహిళ చూస్తుంది. మరోవైపు అంకిత అభి గురించే ఆలోచిస్తూ ఉంటుంది.

Advertisement

ఇంతలో తులసి వచ్చి ఏమైంది అమ్మా అని అడుగుతుంది అంకితను. ఏమైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది ఆంటి అంటుంది అంకిత. అభి ప్రవర్తన ఏం అర్థం కావడం లేదు. పొద్దున వెళ్లాడు.. ఇప్పటి వరకు రాలేదు అంటుంది అంకిత. నిన్నటి నుంచి మనిషి మనిషిగా లేడు. నేను అడిగినా కూడా ఏం చెప్పడం లేదు అంటుంది తులసి.

మరోవైపు అభి భయంతో అక్కడి నుంచి పరిగెడుతుంటాడు. ఓ టీ కొట్టు దగ్గర ఆగుతాడు. ఇంతలో అక్కడ ఉన్నవాళ్లు ఫ్రెండ్ నే మర్డర్ చేసి పారిపోయాడట అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. దీంతో ఇంకా అభి భయపడిపోతాడు.

మరోవైపు అభి ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతుంటారు అంకిత, తులసి. అభి ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాను. ఎవ్వరూ తమ దగ్గరికి రాలేదని చెప్పారు అని అంటుంది. ఇంతలో పోలీసులు వస్తారు. ఇక్కడ అభి అంటే ఎవరు అని అడుగుతారు. ఇక్కడే ఉంటాడా అని అడుగుతారు. అభి నా పెద్ద కొడుకు.. ఎందుకు అని అడుగుతుంది తులసి. దీంతో డబ్బుల కోసం గొడవ పడి తన ఫ్రెండ్ ను పొడిచి పారిపోయాడు అని చెబుతారు పోలీసులు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తరువాయిభాగంలో చూడాల్సిందే.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Gruhalakshmi Episode TodayGruhalakshmi Today SerialIntinti Gruhalakshmi
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు