- టీమిండియా ఫ్యాన్స్‌కు టెన్షన్..
- కేఎల్ రాహుల్ పరిస్థితి ఏంటి?
- తొలి టెస్టు తర్వాత కనిపించిన దృశ్యాలు వైరల్
- మెట్లు ఎక్కేందుకు ఇబ్బంది పడిన స్టార్ బ్యాటర్
KL Rahul Injury : గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత బ్యాట్స్‌మెన్ల ఆధిపత్యం కొనసాగింది. కానీ కేఎల్ రాహుల్ విషయంలో కొన్ని ఆందోళనకరమైన వార్తలు వచ్చాయి. రాహుల్ మంచి ఫామ్‌లో కనిపిస్తూ హాఫ్ సెంచరీ సాధించి శతకం దిశగా దూసుకుపోతున్నాడు. కానీ, మూడో సెషన్ ప్రారంభానికి ముందే అతను గాయపడ్డాడన్న వార్త వెలుగులోకి వచ్చింది.
అతని స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శుభ్‌మన్ గిల్ 16 పరుగులకే ఔటయ్యాడు. రాహుల్‌కు సంబంధించిన దృశ్యాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. తీవ్రమైన నొప్పితో బాధపడుతూ, ఫిజియోథెరపిస్ట్ సాయంతో మెట్లు ఎక్కుతూ కనిపించాడు.
గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కానీ, దురదృష్టవశాత్తు యశస్వి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత రాహుల్, దేవదత్ పడిక్కల్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. రెండో సెషన్‌లో ఇద్దరూ తమ వికెట్లను కాపాడుకోగా, మూడో సెషన్‌లో రాహుల్ స్థానంలో గిల్ వచ్చాడు.
KL Rahul Injury : కేఎల్ రాహుల్‌కు గాయం :
చేయి, కాలు బెణకడంతో కేఎల్ రాహుల్ నొప్పితో బాధపడ్డాడు. టీ-బ్రేక్ సమయంలో ఫిజియోతో కనిపించాడు. మూడో సెషన్‌లో బ్యాటింగ్ కోసం ప్రయత్నించాడు. అయితే, నొప్పి తీవ్రంగా ఉండటంతో గాయంతో రిటైర్ అయ్యాడు. బయటకు వచ్చిన ఫొటోలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫిజియో అతన్ని పట్టుకుని ఉండగా, అతను మెట్లు కూడా సరిగ్గా ఎక్కలేకపోయాడు.
KL Rahul is struggling to walk, feel for him, was dominating at Galle. pic.twitter.com/0KF4G6vy1H
— Johns. (@CricCrazyJohns) August 15, 2026
కేఎల్ రాహుల్ గాయంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. కానీ, ఫోటోలను బట్టి రాహుల్ గాయం తీవ్రమైనదని స్పష్టంగా తెలుస్తోంది. గాయం కారణంగా ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లు సాయి సుదర్శన్, జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నారు.
Read Also : Red Rice for Diabetes : ఎర్ర బియ్యం తింటే షుగర్ కంట్రోల్ అవుతుందా? రెడ్ రైస్ ప్రయోజనాలు, నిజాలు ఇవే
పడిక్కల్ చారిత్రాత్మక సెంచరీ :
గాలే టెస్టు ఫస్ట్ రోజు ఆట వర్షం కారణంగా ఆగిపోయింది. మొత్తం 73 ఓవర్ల ఆటలో భారత్ 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఆగష్టు 15న టెస్ట్ క్రికెట్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా నిలిచిన దేవదత్ పడిక్కల్ సెంచరీ సాధించాడు.
131 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, రెండో రోజు కూడా తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తాడు. రిషబ్ పంత్ 27 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. మొదటి రోజు యశస్వి జైస్వాల్ (32), శుభ్‌మన్ గిల్ (16) రూపంలో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది.