G
Telugu News » Movie Reviews » highway movie review anand deverakonda highway as an interesting thriller
⚡ Movie Reviews, Entertainment, Latest, Trending

Highway Movie Review : హైవే మూవీ రివ్యూ.. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌తో ఆనంద్ దేవరకొండ.. ఆహాలో అదరగొట్టేస్తున్నాడుగా..!

Highway Movie Review, ఆనంద్ దేవరకొండ , " హైవే " ఓటీటీ, కేవీ గుహన్ దర్శకత్వం ,ఆహా, హైవే మూవీ రివ్యూ, telugu news , Abhishek Banerjee

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Highway Movie Review : ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ” హైవే ” తాజాగా ఓటీటీలో విడుదలైంది. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు కేవీ గుహన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఇటీవల ప్రముఖ ఓటిటి సంస్థ (ఆగస్టు 19, 2022) ఆహాలో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ” హైవే ” సినిమా రివ్యూస్ గురించి తెలుసుకుందాం.

Anand Deverakonda’s Movie Review And Rating on Aha OTT

నటీనటులు వీరే (Movie Cast) :

Advertisement
Movie Name :  Highway Movie (2022)
Director :   కేవీ గుహన్
Cast :  ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ, మానస రాధాకృష్ణన్, సయామి ఖేర్
Producers : వెంకట్ తలారి
Music :  సైమన్ కె కింగ్
Release Date : 19, ఆగస్టు 2022


అసలు స్టోరీ ఇదే (Movie Story) :

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విష్ణు(ఆనంద్ దేవరకొండ) ఒక ఫోటోగ్రాఫర్. కానీ జాబ్ కోసం బెంగళూర్ కి బయలుదేరుతాడు. అలాగే ఈ సినిమాలో తులసి(మానస రాధాకృష్ణన్) తన తల్లితో ఓ పౌల్ట్రీ ఫామ్ లో పనిచేస్తుంది. కానీ అక్కడ ఓనర్ వేధింపులు పెట్టే వేదింపులు భరించలేక అక్కడ నుంచి పారిపోతుంది. ఇదిలా ఉండగా మరో పక్క ఓ సీరియల్ కిల్లర్ డి అలియాస్ దాస్(అభిషేక్ బెనర్జీ) వరుసగా 5 మంది మహిళలను హత్య చేస్తాడు. దీంతో అతన్ని పట్టుకోవటానికి పోలీసులు గాలిస్తూ ఉంటారు. దీంతో తప్పించుకునే ప్రయత్నంలో అటు దాస్, తులసి లు ఇటు ఈ సైకో.. వారి ప్రయాణంలో వీరు ముగ్గురు ఎక్కడైనా ఎదురవుతారా? ఎదురయితే ఆ సైకో కిల్లర్ ఏం చేస్తాడు? అన్నదే ఈ సినిమా స్టోరీ.

Highway Movie Review :  ఆనంద్ దేవరకొండ హైవే మూవీ.. ఎలా ఉందంటే?

Anand Deverakonda’s Movie Review And Rating on Aha OTT

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో చాలా అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమా నటీనటుల విషయానికే వస్తే ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ నటించిన పాత్ర ఇదివరకు నటించిన పాత్రలతో పోలిస్తే చాలా మెచ్యూర్డ్ గా ఉంది. ఈ సినిమాలో ఆనంద్ నటించిన పాత్ర వల్ల అతనికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ మానస రాధాకృష్ణ తన అందంతోపాటు నటనతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుది. అలాగే ఈ సినిమా ప్రారంభంలో విలన్ పాత్రకు సంబంధించిన డెవలప్మెంట్ ఆసక్తిగా ఉంది. విలన్ పాత్రలో నటించిన అభిషేక్ బెనర్జీ తనదైన నటన, మ్యానరిజమ్ తో ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ని ప్రదర్శించాడు.

Advertisement

మైనస్ పాయింట్స్ :
ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథకు సరిపోయే పాటలు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ పాయింట్. అలాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా లాజికల్ గా ఉన్నప్పటికీ.. కొన్ని సన్నివేశాలలో మాత్రం లాజిక్ మిస్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలలో కథనం బాగా స్లో అవ్వటంతో ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతున్నారు. అలాగే కొన్ని సన్నివేశాలలో గ్రాఫికల్ విజువల్స్ ప్రేక్షకులకు బాగా తెలిసిపోయే విధంగా ఉన్నాయి.

Anand Deverakonda’s Movie Review And Rating on Aha OTT

ఈ సినిమాకి దర్శకత్వం, సినిమా ఆటోగ్రఫీ చేసిన కేవీ గుహన్ సినిమా ఆటోగ్రఫర్ గా మంచి మార్క్ చూపించాడు. ఈ సినిమా లో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, లాజిక్స్ తో పాత్రలను కలపడం, వాటికీ మంచి ముగింపు ఇవ్వడంతో దర్శకుడిగా కుడా ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా లో సైమన్ కే రాజు అందించిన పాటలు పర్వాలేదు అనిపించినప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా స్టోరీ‌కి తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్, డైలాగులు కూడా పర్వాలేదు.

మొత్తానికి ఈ సినిమా చూస్తే.. ప్రేక్షకులను ఆకట్టుకునే త్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్రలకి మంచి లాజిక్స్‌తో కూడిన ముగింపు ఉన్నాయి. ఈ సినిమాలో స్టోరీ నెమ్మదిగా ఉండటం.. మరికొన్ని చోట్ల చిన్న చిన్న లాజిక్స్ మిస్సవ్వడం వంటివి సినిమాకు మైనస్‌గా మారాయి. చివరిగా చూస్తే  ‘హైవే‘ సినిమా డీసెంట్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు.

[ Tufan9 Telugu News ]
ఆనంద్ దేవరకొండ హైవే
మూవీ రివ్యూ & రేటింగ్ : 2.5/5

Read Also :  ఇవి కూడా చదవండి..
Tees Maar Khan Movie Review : ‘తీస్ మార్ ఖాన్’ మూవీ రివ్యూ & రేటింగ్… ఆదికి నిజంగా అగ్నిపరీక్షే.. హిట్ పడినట్టేనా?! 
Wanted PanduGod Movie Review : ‘వాంటెడ్ పండుగాడ్‘ మూవీ రివ్యూ.. టీవీ స్కిట్‌లకు ఎక్స్‌టెండెడ్ వెర్షన్..!
Commitment Movie Review : ‘కమిట్‌మెంట్’ మూవీ రివ్యూ.. ఐదుగురు అమ్మాయిల ‘మీటూ’ పోరాటం..!

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Abhishek BanerjeeAnand DeverakondaHigh wayHighway Movie ReviewKV GuhanManasa RadhakrishnanSayami KherSimon K KingVenkat Thalari
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు