Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Minister RK Roja : రోజాకు హోంశాఖ..? ముందే అనుకుని పదవి ఇచ్చారా..? ఫైర్ బ్రాండ్ కు ఏ శాఖ అన్న దానిపై సర్వత్రా ఆసక్తి

Minister RK Roja : నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రతి పక్ష నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడతారు. రోజాతో పెట్టుకోవడం అంటే సాహసమనే చెప్పాలి. ఆమెకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన మాటల ధాటికి ఎవరైనా జంకాల్సిందే. ఆ ఫైర్ తోనే అభిమానులను సొంతం చేసుకున్నారు.

నిన్నటి వరకు ఎమ్మెల్యే మాత్రం అయిన రోజా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి. అంతకుముందు రోజా మంత్రి పదవి కోసం ఎక్కని గుడి మెట్టు లేదు. ఆమె చేత పూజలు అందుకోని దేవుడు లేడు అన్నట్లుగా ఆలయాలు తిరిగింది జబర్దస్త్ ఎమ్మెల్యే రోజా. చివరికి ఆమె కోరిక నెరవేరింది. మొదటి కేబినెట్ లోనే మంత్రి పదవి వస్తుందని ఆశించిన రోజాకు.. మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కింది.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ప్రస్తుతం రోజాకు ఏ శాఖ అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. అయితే చాలా మంది ఫైర్ బ్రాండ్ రోజాకు హోంమంత్రి పదవి దక్కుతుందని అనుకుంటున్నారు. మంత్రి పదవి ఖరారు కాగానే.. హోంమంత్రి అంటూ ప్రచారం జరిగింది. వికీపీడియో సైతం రోజాను హోంమంత్రిగా నియమించారంటూ అప్ డేట్ కనిపిస్తోంది. ఈ ఊహాగానాలకు, ప్రచారాలకు కాసేపట్లో తెరపడే అవకాశం ఉంది.

Advertisement

Read Also : Minister RK Roja : రోజాకు హోంశాఖ..? ముందే అనుకుని పదవి ఇచ్చారా..? ఫైర్ బ్రాండ్ కు ఏ శాఖ అన్న దానిపై సర్వత్రా ఆసక్తి

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?
Advertisement
Exit mobile version