Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Chanakya Niti: భర్త ఎప్పుడు కూడా భార్య దగ్గర చెప్పకూడని నాలుగు విషయాలు ఇవే?

Chanakya Niti : ఆచార్య చాణిక్యుడు ఒక మనిషి ఎలాంటి మానవతా విలువలతో జీవితంలో ముందుకు సాగాలో ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ఈ క్రమంలోనే ఒక మనిషి ఎదుగుదలకు ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన విషయాలను ఆచార్య చాణిక్యుడు నీతి గ్రంధం ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య బంధం ఎంతో అన్యోన్యంగా కొనసాగాలంటే భర్త ఎప్పుడూ కూడా భార్య దగ్గర కొన్ని విషయాలను ప్రస్తావించకూడదని చాణిక్యుడు నీతి గ్రంధం ద్వారా వెల్లడించారు. మరి భర్త భార్య దగ్గర చెప్పకూడని విషయాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

Chanakya Niti

బలహీనత: భర్త తన బలహీనతను ఎప్పుడూ కూడా భార్య దగ్గర ప్రస్తావించ కూడదు.ఒకవేళ తన బలహీనతను భార్య దగ్గర చెప్పినప్పుడు భార్య తన అభిప్రాయాన్ని భర్తకు తెలియజేసే సమయంలో తన బలహీనత పై దాడి చేస్తుంది కనుక భర్త ఎప్పుడూ కూడా తన బలహీనతను భార్యతో పంచుకోకూడదు.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

సంపాదన: ఒక భర్త తాను ఎంత సంపాదిస్తున్నారు అనే విషయాన్ని భార్యకు ఎప్పుడూ చెప్పకూడదని చాణిక్యుడు వెల్లడించారు. ఇలా భర్త సంపాదన భార్యకు తెలిస్తే దానిపై ఆమె హక్కులు పొందడమే కాకుండా, మీ ఖర్చులపై కూడా ఆరా తీస్తుంది.ఖర్చులను ఆపడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది తద్వారా కొన్నిసార్లు ముఖ్యమైన పనులను కూడా చేయలేక ఎంతో నష్ట పోవాల్సి పరిస్థితులు వస్తాయి.

Advertisement

దానధర్మాలు: దానధర్మాలు చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే మీరు చేసే దానధర్మాలు గురించి ఎప్పుడూ కూడా మీ దగ్గర ప్రస్తావించ కూడదని చాణిక్యుడు తెలిపారు. ఇలా చెప్పడం వల్ల మీ దానధర్మాల ప్రాముఖ్యత తగ్గుతుంది. అలాగే మీ మంచి చెడులను కూడా ఎత్తి చూపే పరిస్థితులు ఏర్పడతాయి.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

అవమానాలు: మీరు బయట ఎవరిచేతనైనా అవమాన పడితే ఆ అవమానాన్ని భార్య దగ్గర ఎలాంటి పరిస్థితులలోనూ చెప్పకూడదు.ఆ అవమానాన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి కాని దానిని భార్య దగ్గర ప్రస్తావిస్తే ఆమె కూడా పలు సందర్భాలలో మీ అవమానాన్ని ఎత్తిచూపే పరిస్థితులు ఏర్పడతాయి.

Read Also : Chanakya neethi: పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో చూడాల్సిన లక్షణాలు ఇవే..!

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version