Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu March 8th Today Episode : దేవయానిఫై విరుచుకుపడ్డ వసుధార.. రిషి ఏం చేయనున్నాడు..?

Guppedantha Manasu March 8th Today Episode : బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..జగతి, మహేంద్ర లు జరిగిన దాని గురించి బాధపడుతూ, వారిద్దరు భార్యాభర్తలు అన్న విషయం కాలేజ్ మొత్తానికి తెలిసిపోయినందుకు బాధ పడుతూ ఉంటారు. ఇక అప్పుడు మహేంద్ర జగతికి ధైర్యం చెబుతాడు. మరోవైపు కాలేజీ స్టాప్ జగతి మహేంద్ర గురించి మాట్లాడుతూ ఉండగా అది విని కోపంతో రగిలిపోతాడు.

వెంటనే జగతి ను తన క్యాబిన్ కు రమ్మని చెబుతాడు రిషి. మరొకవైపు వసు ఒకచోట కూర్చొని బాధపడుతూ ఉండగా, అదే మంచి సమయం అనుకున్న గౌతమ్ ప్రపోజ్ చేయడానికి వెళతాడు. గౌతం ప్రపోజ్ చేసే సమయానికి ఈ వసుధార పక్కకు వెళ్లగా అక్కడికి పుష్ప వస్తుంది. సారీ పుష్ప నీకు ప్రపోజ్ చేయలేదు అని కవర్ చేస్తాడు గౌతమ్.

Guppedantha Manasu March 8th Today Episode

మరొకవైపు దేవయాని జర్నలిస్ట్ కు ఫోన్ చేసి మ్యాటర్ ఎందుకు ఇంకా పబ్లిసిటీ కాలేదు అని గట్టిగా అడగగా ఆ పని నేను చేయలేను రిషి సార్ అడ్డుపడుతున్నారు అని చెబుతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ధరణి స్వీట్ చేయమంటారా అత్తయ్య అంటూ వెటకారంగా మాట్లాడుతుంది.

Advertisement

Guppedantha Manasu March 8th Today Episode : దేవియానికి వసూ ఇచ్చిపడేసిందిగా.. 

ఇక రిషి,జగతి ని తన క్యాబిన్ కి పిలిచి మన గురించి అందరూ గుచ్చి గుచ్చి మాట్లాడుకుంటున్నారు మేడం.మీరు మా నాన్నకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది అన్న విధంగా మాట్లాడుతాడు. దీంతో జగతి సరే అంటూ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది.

ఇంతలో అక్కడికి వచ్చిన మహేంద్ర జగతిని ఏమి అన్నావ్ అంటూ రిషి ఫై కోప్పడతాడు. మరొకవైపు జగతి బాధ పడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన దేవయాని చాలా ఆనందంగా ఉంది అంటూ మాట్లాడుతుంది. దీంతో కోపం వచ్చిన వసుధార ఏమాత్రం లెక్కచేయకుండా దేవయానిపై విరుచుకుపడుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Guppedantha Manasu March 7th Today Episode : వసుధార పై సీరియస్ అయిన రిషి.. బాధలో జగతి..?

Advertisement
Exit mobile version