Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

PM Modi : ప్రధాని మోదీని చంపేస్తామంటూ ఎన్ఐఏకు మెయిల్

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తానంటూ ఓ ఆగంతకుడు జాతీయ దర్యాప్తు సంస్థ కు మెయిల్ పంపాడు. అలాగే తన వద్ద ఉన్న 20 కిలోల ఆర్డీఎస్క్ తో దేశ వ్యాప్తంగా వేల మందిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు అందులో వివరించాడు. మొత్తం 20 ప్రాంతాల్లో దాడులకు పథకం వేసినట్లు పేర్కొన్న ఆగంతకుడు 2 కోట్ల మందిని చంపాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు వివరించాడు. అలాగే వీలైనంత త్వరగా ప్రధాని మోదీని చంపేస్తానని ప్రకటించాడు.

ఆర్​డీఎక్స్​ దాడులకు సంబంధించి దేశంలో 20 మంది స్లీపర్ సెల్ప్ పని చేస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటికే ప్రధాన నగరాల్లో బాంబులు పెట్టినట్లు ఆగంతకుడు వివరించాడు. ప్రధాని మోదీకి బెదిరింపు ఈ-మెయిల్‌ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ అప్రమత్తమైంది. అంతే కాకుండా తమకు వచ్చిన ఆ-మెయిల్ ను ఎన్ఐఏ వివిధ ఏజెన్సీలతో పంచుకుంది. మరోవైపు ఈ-మెయిల్ ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు సైబర్ సెక్యూరిటీ విభాగం రంగంలోకి దిగింది. అలాగే ప్రధాని మోదీ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.

Read Also : Every Three Years Marriage : మూడేళ్లకొకసారి విడాకులు, మళ్లీ పెళ్లి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Advertisement
Exit mobile version