Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam : హిమ ఫై పగ తీర్చుకుంటాను అంటున్న సౌర్య.. బాధతో కుమిలిపోతున్న హిమ..?

Karthika Deepam March 25th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. సౌర్య, చంద్రమ్మ దంపతుల ఇంటి ముందు ఒంటరిగా కూర్చుని తన చేతి పై ఉన్న పచ్చబొట్టును చూసుకుంటూ ఎక్కడ ఉన్నావే హిమ, ఇల్లు అమ్మేసారంట కదా, నాకోసం ఒక్కసారి వెతికారా, అయినా చిన్నప్పటి నుంచి నువ్వు ఇంట్లో పెరిగావ్ కాబట్టి అందుకే వాళ్లందరికీ నీ పై ఎక్కువ ప్రేమ ఉంటుంది.

కానీ నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను వెతికి పట్టుకుంటాను, పగ తీర్చుకుంటానని నిన్ను వదిలేదేలే అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఇంద్రమ్మ దంపతులు వచ్చి ఏం చేస్తున్నావు అని అడగగా ఏమీ లేదు అని అంటుంది. ఇక సౌమ్య తన అమ్మ నాన్న చనిపోయిన కావడంతో మరుసటి రోజు గుడిలో వారి పేరుమీద అన్న దానం ఏర్పాట్లు చేయిస్తుంది.

మరొకవైపు హిమ కూడా చేతి పై ఉన్న పచ్చబొట్టును చూసుకుంటూ అత్త స్వప్న మాటలు తలుచుకొని కుమిలిపోతూ ఉంటుంది. ఎక్కడ ఉన్నావ్ సూర్య నాపై ఇంకా కోపం తగ్గలేదా? నా వల్లే అమ్మ నాన్న లు చనిపోయారు కదా అంటూ హిమ బాధతో కుమిలిపోతూ ఉంటుంది.

Advertisement
Karthika Deepam March 25th Today Episode

ఇంతలో సౌందర్య వచ్చి హిమ ను ఓదారుస్తుంది. మరుసటి రోజు కార్తీక దీప ల వర్ధంతి సందర్భంగా సౌర్య గుడి లో అన్నదాన కార్యక్రమం చేయిస్తూ ఉంటుంది. ఇంతలో సడన్ గా సౌర్య కు తన తల్లి దీప మాటలు గుర్తుకు వచ్చి ఎమోషనల్ అవుతుంది. తన తల్లిని తలుచుకున్నా సౌర్య గుండెల్లో నుంచి దుఃఖం పొంగుకు వస్తూ బాధతో మరింతగా ఎమోషన్ అవుతూ ఉంటుంది.

ఇక అది చూసి ఇంద్రమ్మ దంపతులు సౌర్యం ఓదారుస్తారు. మరొకవైపు సౌందర్య, ఆనందరావు, హిమ కలసి గుడికి బయలుదేరుతారు. ఇంతలో హిమ, నానమ్మ నిరూపమ్ ని కూడా గుడికి పిలుద్దామా అని అనగా వద్దులేమ్మా అని అంటుంది సౌందర్య. అప్పుడు ఆనంద్ రావు తన పిల్లలందరినీ తలుచుకొని ఒక్కసారిగా ఎమోషనల్ అవ్వడంతో గుండెనొప్పి వస్తుంది.

దీనితో సౌందర్య, హిమ లు టెన్షన్ పడతారు. ఆ తరువాత సౌర్య సత్య ఇంటికి టిఫిన్ తీసుకుని వెళ్లి కూర్చోండి సార్ వడ్డిస్తాను అని అంటుంది. అప్పుడు సౌందర్య సత్య కి ఫోన్ చేస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Karthika Deepam: హిమ ని అవమానించిన స్వప్న.. సౌందర్యాన్ని చూసిన సౌర్య..?

Exit mobile version