Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Devatha Serial March 7 Today Episode : తప్పు తెలుసుకున్న సత్య.. ఆదిత్య ఏం చేయనున్నాడు..?

Devatha Serial March 7 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆదిత్య చిన్మయి కి ఫోన్ చేసి దేవుని వీడియో కాల్ లో చూపించమని అంటాడు. ఇక ఆదిత్య దేవిని వీడియో కాల్ లో చూస్తూ ఉండగా ఇంతలో అక్కడికి సత్య వచ్చి ఆదిత్య చేతిలో ఉన్న మొబైల్ లాక్కొని కట్ చేస్తుంది. ఆదిత్య పై కోప్పడుతూ నువ్వు మారవా ఆదిత్య.. ఎంతసేపు దేవి దేవి అని అంటావు.

నీతో మాట్లాడితే సరిపోతుంది. కానీ ఇంట్లో వాళ్ళు ఏమై పోయినా నీకు పర్వాలేదు. ఇంట్లో చాలా మంది చాలా రకాలుగా పిలిపించుకోవాలని ఉంది. నాకు అమ్మ అని అనిపించుకోవాలని ఉంది. ఇవన్నీ నీకు పట్టవా? నాలోని లోపం ఉంది అని అన్నావు మందులు వాడుతున్నావా లేదో తెలియదు అంటూ ఆదిత్యను చడా మడా తిట్టేసి ఇదిగో తీసుకో నీ మొబైల్ ఫోన్ అంటూ మొబైల్ విసిరి వెళ్లి పోతుంది సత్య.

Devatha Serial March 7 Today Episode

అంతా విన్న దేవుడమ్మ మరొకవైపు బాధపడుతూ ఉంటుంది. మరోవైపు చిన్మయి కి పొలమారడం తో రాధ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు చిన్మయి చాలు అమ్మ అంటూ కిందికి పరుగులు తీస్తుంది. రాధా తినిపించడానికి ఏం తిన్నారు అంటూ వారి వెనకే పరుగులు తీస్తుంది. ఇదంతా చూస్తున్న రమ్య రాధతో గొడవకు దిగుతుంది.

Advertisement

దేవి కంటే, చిన్మయి ని ఎక్కువ ప్రేమగా చూస్తున్నావు అంటూ ఆ మధ్య గొడవ జరుగుతుంది.కోపం రాధా ఇంకొక్క మాట మాట్లాడితే బొక్కలో గుజ్జు తీస్తా బిడ్డా అంటూ రమ్య కు వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన దేవి మా అమ్మను ఏమైనా అంటే ఊరుకోను అని అంటుంది. ఏం చేస్తావు అని రమ్య అడగగా.. మా అమ్మ కోసం నేను ఆఫీసర్ గానే లెక్కచేయలేదు నువ్వెంత అంటూ దేవి కోప్పడుతుంది.

అనంతరం రాధా ఆఫీసర్ గా నన్ను బాధ పెట్టడం నువ్వు ఎప్పుడు చూసావు అని అడగగా ఆ రోజు జరిగింది నాకు తెలుసు లే అమ్మ అని అంటుంది దేవి. మరొకవైపు సత్య బాధ పడుతూ ఉండగా.. దేవుడమ్మ సత్య దగ్గరకు వెళ్లి.. బాధపడకు సత్య రుక్మిణి తోడబుట్టిందే అయినప్పటికీ ఆ బాధలో నువ్వు కోరుకున్నట్లు ఆదిత్య ఇప్పటికి కోలుకోలేదు కదా సత్య. ఈరోజు నువ్వు అడిగిన విధంగానే నీలో లోపం ఉంటే వాడు ఎప్పటికీ నిన్ను చూసే వాడు కాదు అంటూ సత్యకు అర్థమయ్యే విధంగా చెప్పి వెళ్లిపోతుంది.

ఇక మరోవైపు రాధ శివరాత్రి జాగరణ గుడికి వెళ్తుండగా నేను కూడా వస్తాను అంటూ మాధవ వెళ్తాడు. మరోవైపు సత్య జరిగినదాన్ని తలుచుకునే బాధపడుతూ ఆదిత్య దగ్గరకు వెళ్లి సారీ చెబుతుంది.

Advertisement

Read Also : Intinti Gruhalakshmi : రోడ్డున పడ్డ శృతి, ప్రేమ్.. తులసి పై ఫైర్ అవుతున్న కుటుంబ సభ్యులు..?

Exit mobile version