Guppedantha Manasu : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక రిషి కారులో కాలేజ్ దగ్గరికి రాగానే వెంటనే వసుధార రిషి కి తాను ఉన్న ప్లేస్ గురించి వాయిస్ మెసేజ్ చేస్తుంది. వెంటనే రిషి తాను పిలిస్తే నేను వెళ్లాలా అనుకుంటూ వాయిస్ మెసేజ్ కు రిప్లై ఇవ్వడు. దీంతో వసు సార్ రిప్లై ఇవ్వడం లేదు ఏంటి అని అనుకుంటుంది.
అలా ఆ చాక్లెట్ ను ఇద్దరు తీసుకొని తింటారు. ఇక రిషి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత వసు తనలో తాను.. ఏం చేస్తున్నానో అని అనుకుంటుంది. మరోవైపు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మీటింగ్ జరుగుతూ ఉండగా అందులో రిషి చాక్లెట్ షార్ట్ ఫిలిం చేస్తున్నాం కదా అని అనడంతో అందరు షాక్ అవుతారు. వెంటనే రిషి మాట మారుస్తూ మాట్లాడుతాడు.
Guppedantha Manasu : అసలు ఆ లవ్ లెటర్‌లో ఏముంది?
గౌతమ్ రిషి క్యాబిన్ లో కూర్చొని రిషి ఫోటో చూసుకుంటూ.. అవునురా వసుధారని ప్రేమిస్తున్నా.. అయితే నీకేంటి అని అనుకుంటూ ఉండగా అప్పుడే రిషి వస్తాడు. ఏం లేదు అంటూ తడబడుతూ ఉంటాడు. ఇక తనకు ఓ లవ్ లెటర్ రాసి ఇవ్వాలి అని.. అమెరికా గ్రూపులో ప్రేమలేఖలు పోటీ పెట్టారని అందుకోసం నువ్వే ఒక లేఖ రాయాలి అని అనడంతో దానికి రిషి ఒప్పుకుంటాడు.
వెంటనే వసును ఊహించుకొని లవ్ లెటర్ రాస్తాడు. మరోవైపు ధరణి వసు బొమ్మను చూసి గౌతమ్ గీసాడు అనుకొని ఈ విషయం ఎలాగైనా మహేంద్ర కు చెప్పాలని అనుకుంటుంది. అప్పుడే దేవయాని వచ్చి తనతో కాసేపు వెటకారంగా మాట్లాడుతుంది. గౌతమ్ ఆ లవ్ లెటర్ ని తీసుకొని వెళ్లి వసు బుక్ లో పెడతాడు. ఆ లెటర్ జారిపోవడం తో జగతి తీసి చూస్తుంది. వెంటనే గౌతమ్ అక్కడికి వెళ్లటం తో ఎవరో లవ్ లెటర్ రాశారు అని ఎలాగైనా వీరిని వదిలేదని రిషితో అంటుంది. ఇక రిషి గౌతమ్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఆ లెటర్ రాసింది రిషి అని తెలిస్తే మాత్రం రిషి అడ్డంగా బుక్ అవడం గ్యారెంటీ.
Read Also : Karthika Deepam: పిల్లల భోజనం కోసం హోటల్ లో పని చేయడానికి సిద్ధమైన డాక్టర్ బాబు!
- Guppedantha Manasu july 6 Today Episode : సినిమాకి వెళ్తున్న రిషి, సాక్షి.. కోపంతో రగిలిపోతున్న వసుధార..?
- Guppedantha Manasu Serial సెప్టెంబర్ 30 ఎపిసోడ్ : వసుధారని చూసి షాక్ అయిన జగతి దంపతులు.. అదేంటో తెలుసుకోవాలనే ఆరాటంలో దేవయాని..?
- Guppedantha Manasu: రిషి,వసు ల విషయంలో మరొక ప్లాన్ చేసిన దేవయాని సాక్షి..?
