Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Viral Video : పెళ్లి కూతురు కరాటే చూసి పారిపోయిన పెళ్లి కొడుకు.. వీడియో వైరల్

Viral Video : ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో జరుగుతున్న వింతలూ విశేషాలు ఇంకెక్కడా జరగడం లేదోమో. ఫొటోషూట్ ల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతీ దాన్ని కొత్తగా చేస్కోవడానికి ఇష్టపడుతున్నారు. మొన్నటికి మొన్నఓ జంట కాంట్రాక్ట్ పెళ్లి చేస్కోగా.. ఇప్పుడేమో ఓ పెళ్లి కూతురు ఏకంగా కరాటేనే చేస్తోంది. అది చూసిన పెళ్లి కొడుకు అక్కడి నుంచే అటే పారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మీరూ ఓ వీడియోపై లుక్కేసి అసలేం జరిగిందో తెల్సుకోండి.

Bride ran away after seeing the brides karate video viral

ఏ పెళ్లి కూతురు అయినా పెళ్లి మండపంలోకి డ్యాన్స్ చేస్కుంటూనే లేదంటే సిగ్గుల మొగ్గై సిగ్గు పడుతూనో వస్తుంటుంది. కానీ ఓ వధువు మాత్రం కరాటే చేస్తూ వచ్చింది. నాన్ చాక్ ని చేతిలో పట్టుకొని ఇష్టం వచ్చినట్లు తేలికగా తిప్పేస్తోంది. ఇది చూసిన వరుడు వామ్మో అనుకుంటూ షాక్ అయ్యాడు. ఇక్కడ తాను ఉండకపోవడమే బెటర్ అనుకున్నాడో ఏమో అటు నుంచి అటే వెళ్లిపోయాడు.

ఈ సీన్ మొత్తాన్ని గమనించిన బంధువులు, స్నేహితులు ఒకటే నవ్వడం. ఇక భవిష్యత్తులో పెళ్లి కొడుకు ఏవైనా వేషాలు వేస్తే అమ్మాయే అతడి సంగతి చెప్తుందంటూ కామెంట్లు వేస్కుంటూ నవ్వుకున్నారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఒక్కో విధంగా కామెంంట్లు చేస్తున్నారు. పెళ్లాం అంటే ఆ మాత్రం భయం ఉండాలి అంటూ కొందరు, ఇక నీ పని అయిపోయింది పో బ్రో అంటూ మరికొందరు చెబుతున్నారు.

Advertisement


Read Also : Viral Video: చెల్లి మీద ఆ బుడ్డోడికి ఉన్న ప్రేమ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే!

Exit mobile version