Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Pawan Kalyan : విశాఖ వేదిక‌గా వైసీపీపై ప‌వ‌న్ టార్గెట్‌?

Pawan Kalyan Targets YSRCP against to Vizag Steel Plant privatisation

Pawan Kalyan Targets YSRCP against to Vizag Steel Plant privatisation

Pawan Kalyan : జ‌న‌సేనాని ప‌వ‌న్ విశాఖ స్టిల్ ప్యాక్ట‌రీ ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భలో పాల్గొన్నారు. ఈ స‌భ‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ.. అంద‌రూ క‌లిసి త‌న‌ను ఒంట‌రి చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విశాఖ స్టీల్స్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తాన‌ని పేర్కొన్నారు. అయితే జ‌న‌సేనాని ప‌వ‌న్ మాత్రం వైసీపీ ని టార్గెట్ చేసుకునేందుకే విశాఖ‌కు వ‌చ్చార‌నే చ‌ర్చ జ‌రుగుతుంది.

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ప‌వ‌న్ పోరాటం చేస్తే త‌న‌కు ఎవ‌రూ మ‌ద్ద‌తు ఇవ్వ‌లేద‌ని, విప‌క్షాలు ఏక‌మైన త‌న పోరాటానికి తూట్లు పొడిచార‌ని వ‌ప‌న్ చెప్పారు. అయితే వ‌ప‌న్ క‌ళ్యాణ్ మాత్రం ప్ర‌త్యేక హోదా కోసం ఎలాంటి పోరాటం చేయ‌లేద‌ని, తిరుప‌తి, కాకినాడ‌లో రెండు బ‌హిరంగ స‌భ‌లు పెట్టార‌నే కానీ ఏ రోజు ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేయ‌లేద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

గ‌తంలో ప్ర‌తి ప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేశారు. రాష్ట్రంలో ఎక్క‌వ‌గా బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించారు. రాష్ట్రంలో బంద్ పాటించారు. జిల్లాల‌లో ప్ర‌త్యేక హోదా కోసం ఆందోళ‌న‌లు చేశారు. అప్ప‌టి చంద్ర బాబు ప్ర‌భుత్వం ఆందోళ‌న కారుల‌పై ఉక్కు పాదం మోపింది. ప్ర‌త్యేక హోదా కోసం ప‌ని చేసే విద్యార్థుల‌ను క‌ళ‌శాల‌ల నుంచి పంపించేయాల‌ని స్వ‌యంగా చంద్ర‌బాబు యాజ‌మాన్యాల‌కు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

ప్రత్యేక హోదా కోసం పోరాటం జ‌రుగుతుంటే దానిని అణించివేయాల‌ని చంద్ర‌బాబు చూస్తేంటే ఎందుకు వ‌ప‌న్ మాట్లాడ‌లేద‌నే చ‌ర్చ జ‌రుగుతుంది. ఇప్పుడేమో తాను ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేస్తే మ‌ద్ద‌తు ఇవ్వ‌లేద‌ని చెబుతున్నార‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. విశాఖ ఉక్క‌ను ప్ర‌యివేట్ ప‌రం చేస్తుంది కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వ‌మే. ఎందుకు ఈవిష‌యంపై మోడీని టార్గెట్ చేయ‌డం లేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

తనను ఓడించిన జనాలపై పవన్ కు ఇంకా మంట తగ్గినట్లులేదు. అందుకనే నా సభలకు జనాలు వస్తారు కానీ ఓట్లు మాత్రం వైసీపీకే వేస్తారన్నారు. ఓట్లు వైసీపీకి వేసి నన్ను బాధ్యత తీసుకోమని అడగటం ఏమన్నా ధర్మమా అని అమాయకంగా ప్రశ్నించటం విడ్డూరమే. అందుకనే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్నీ పార్టీలు రంగంలోకి దిగితే తాను వెనకుంటానని పవన్ చెప్పారు. ఒకవైపేమో వైసీపీపై తనకు నమ్మకం లేదని చెబుతునే వైసీపీ ఎంపీలు లేకపోతే పని జరగదనటం వపన్ మాటల్లోని డొల్లతనం తెలియజేస్తోంది.
Read Also : Balayababu : బాల‌య్య‌కు రాజ‌కీయాల్లో ఆస‌క్తి లేదా?

Advertisement
Exit mobile version