Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Nandy Sisters Naatu Naatu : నాండీ సిస్టర్స్ `నాటు నాటు` ఊరమాస్‌ డాన్సు‌తో ఊపేసారుగా.. వీడియో!

Nandy Sisters Naatu Naatu : జక్కన్న దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన నెలలు గడుస్తున్నా మూవీలోని పాటల క్రేజ్ ఇంకా తగ్గనలేదు. ఇప్పటికీ ఆర్ఆర్‌ఆర్ నాటు నాటు పాట మారుమోగుతూనే ఉంది. సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ పాటలు, యాక్షన్ సీన్లు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉన్నాయి.

Nandy Sisters Naatu Naatu

ఇన్‌స్టా రీల్స్ చూస్తే చాలు.. ఆర్ఆర్‌ఆర్ పాటలే వినిపిస్తున్నాయి. ప్రతిఒక్కరూ వయస్సుతో సంబంధం లేకుండా `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీలోని పాటలతో డాన్సు చేస్తూ సందడి చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీలో `నాటు నాటు` సాంగ్‌ ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయింది. ఇప్పుడు ఇదే పాటను నాండీ సిస్టర్స్ అనే ఇద్దరు అమ్మాయిలు తమ ఊరమాస్ స్టెప్పులతో ఊపేశారు. ఇద్దరు సిస్టర్స్ కలిసి `నాటు నాటు` పాటని ఫుల్‌గా రీక్రియేట్‌ చేశారు. మ్యూజిక్‌ కూడా వాళ్లే వాయించారు.

వాళ్లే పాట పాడారు.. డాన్సు కూడా చేసేశారు. `నాటు నాటు` పాటకి ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టారు. ఇద్దరు సిస్టర్స్ వేసిన డాన్స్.. ఎక్స్‌ ప్రెషన్స్‌ చూస్తుంటే ఎవరైనా ఫిదా కావాల్సిందే.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యూట్యూబ్‌ షార్ట్స్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఇంతకీ ఈ ఇద్దరు అమ్మాయిలు ఎవరంటే.. అంతారా నాండీ, అంకిత నాండీ అక్కా చెల్లెళ్లు. ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటని రీక్రియేట్‌ చేశారు.

Advertisement

వీరిద్దరూ తమ వీడియోలతో చాలావరకూ సోషల్‌ మీడియాలో పాపులార్ అయ్యారు. ఇప్పుడు నాటునాటు సాంగ్‌ కూడా పాపులర్ అయింది. ఈ అమ్మాయిలిద్దరూ చూడటానికి కవలలా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ నటించారు. మే 25న విడుదలైన RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు రికార్డులను బ్రేక్ చేసింది. 450కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రూ.1150 కోట్లు వసూలు చేసింది. ఓటీటీలోనూ అదే రికార్డులతో దూసుకెళ్తోంది.

Read Also : Viral Video: మాస్ సాంగ్ కు ఊర మాస్ స్టెప్పులు.. ఎద అందాలతో అల్లాడిస్తున్న యువతి!

Advertisement
Exit mobile version