Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

MLA Roja Nagababu : నాగబాబుకు ఎమ్మెల్యే రోజా కౌంటర్.. పవన్‌పై సంచలన కామెంట్స్..!

MLA Roja Nagababu Counter : MLA Roja Selvamani Counter to Mega Brother Nagababu on Bheemla Nayak Movie Tickets

MLA Roja Nagababu Counter : MLA Roja Selvamani Counter to Mega Brother Nagababu on Bheemla Nayak Movie Tickets

MLA Roja Nagababu : ఆంధ్రప్రదేశ్‌లో మూవీ టికెట్ల వివాదం కొలిక్కిరావడం లేదు. మూవీ టికెట్లపై వివాదం పవన్ మూవీ భీమ్లా నాయక్ రిలీజ్ తర్వాత మళ్లీ మొదలైంది. ఏపీలో భీమ్లా నాయక్ బెనిఫిట్ షో రద్దు చేయడంపై పవన్ అభిమానులు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై మెగా బ్రదర్ నాగబాబు ఏపీ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫేస్ బుక్ వీడియో ద్వారా ఆయన సీఎం జగన్‌పై మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పై జగన్ పగ పట్టారని విమర్శలు గుప్పించారు. కోపం ఉంటే.. నా మీద చూపించు అన్నందుకే పవన్ పై పగబట్టి ఇలా మూవీల రిలీజ్ విషయంలో వేధిస్తున్నారని నాగబాబు ఫైర్ అయ్యారు.

జగన్ రెడ్డికి మూవీ ఇండస్ట్రీతో పాటు పవన్ కూడా టార్గెట్ అయ్యారని అనిపిస్తుందని నాగబాబు అన్నారు. ప్రభుత్వం ఉండేది ఐదు సంవత్సరాలేనని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. సినిమా విడుదలకు అడ్డంకులు కలిగిస్తే. కల్యాణ్ బాబుకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. సినిమా నిర్మతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలకు మాత్రమే నష్టం వస్తుందన్నారు. భీమ్లా నాయక్ సూపర్ హిట్ అయిందని అన్నారు. పవన్‌పై ప్రభుత్వం పగబట్టిందని, కక్షగట్టిందని, టార్గెట్‌ చేసింది అంటూ నాగబాబు హాట్‌ కామెంట్స్‌ చేశారు. పవన్‌ను అణగదొక్కేందుకే మూవీ టికెట్స్‌ పెంపుపై కొత్త జీవో ఇవ్వలేదని నాగబాబు విమర్శించారు.

పవన్ తొక్కేయాల్సిన అవసరం మాకేంటి : ఎమ్మెల్యే రోజా :
ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డిపై నాగబాబు చేసిన కామెంట్లపై వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు. ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై పవన్‌ కళ్యాణ్‌కి అంత బాధ ఎందుకో తనకు అర్ధం కావట్లేదని అన్నారు పవన్‌ ఏమైనా ప్రొడ్యూసరా? లేదా డిస్ట్రిబ్యూటరా? అని ప్రశ్నించారు. పవన్‌ను తొక్కేయాల్సిన అవసరం మాకేంటి అని రోజా సూటిగా ప్రశ్నించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పుష్ప, నందమూరి బాలకృష్ణ అఖండ మూవీలకు టిక్కెట్ల రేట్లు ఎంత ఉన్నాయో.. ఇప్పుడూ అదే రేట్స్‌ అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. అయినా ఏపీ ప్రభుత్వం చేసిన అన్యాయం ఏముందని రోజా కౌంటర్ ఇచ్చారు.

ఒకవేళ రేట్లు పెంచుకోవాలంటే జాయింట్‌ కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవచ్చుకదా? అని రోజా సూచించారు. టికెట్ ధరల నిర్ణయం కొలిక్కకి వస్తుందనుకునే సమయంలోగా మంత్రి గౌతమ్ రెడ్డి మరణించడంతో కాస్త ఆలస్యం అయిందన్నారు. ఈలోపే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యిందని రోజా వివరణ ఇచ్చారు. పవన్ తన సినిమాను అడ్డుపెట్టుకొని పవర్ రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. రోజా కౌంటర్లపై నాగబాబు, పవన్ కల్యాణ్ ఎలా స్పందించారో చూడాలి మరి.

Advertisement

Read Also : Tamanna Simhadri : ఆ మాట అన్నందుకు చెప్పుతో కొట్టాలి.. తమన్నా షాకింగ్ కామెంట్స్..!

Exit mobile version