Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Niharika Pub Case : బంజారాహిల్స్ పబ్ కేసులో ప్రముఖులు.. నిహారికకు పోలీసుల నోటీసులు!

Niharika in Pub Case : హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో 144 మంది పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పోలీసులకు పట్టు బడిన సినీ ప్రముఖుల్లో బిగ్ బాస్ విన్నర్, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా డాటర్ నిహారిక కూడా ఉన్నారు. అయితే నిహారికకు పోలీసులు నోటీసులు ఇచ్చి పంపివేశారు. అలాగే పబ్ లో మరికొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ముందుగా వారి వద్ద నుంచి వివరాలుతీసుకు పోలీసులు ఆ తర్వాత వారిందరినీ వదిలేశారు.

పబ్ లో నిర్వహించిన తనిఖీల్లో కొకైన్, గంజాయి వంటి వాటితో పాటు ఎల్ఎస్​డీ సిగరెట్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అధికారులు అక్కడికి వచ్చారని తెలుసుకోగానే… పలువురు మత్తు పదార్థాలను కింద పడేసినట్లు తెలుస్తోంది. అయితే అసలు పబ్‌లోకి డ్రగ్స్‌ ఎలా వచ్చాయి, ఎవరెవరు ఎవరెవరు మత్తుపదార్థాలు తీసుకున్నారనే విషయాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే పబ్ లో ఎవరెవరు డ్రగ్స్ వినియోగించారు, ఎరెవరు సప్లై చేశారనే విషయాలను సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా తెలుసుకునేందుకు పోలీసులు చర్యలు జరుపుతున్నారు.

Read Also : Hyderabad Metro : మరింత వేగంతో పరుగులు పెట్టబోతున్న హైదరాబాద్ మెట్రో రైళ్లు..!

Advertisement
Exit mobile version