Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Devatha : రాధను నిలదీసిన మాధవ.. సంబరాలు చేసుకుంటున్న చిన్మయి, దేవి..?

Devatha Serial March 15 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. హోలీ సంబరాలు మొదలు కావడంతో ఆదిత్య సత్య ఆటపట్టిస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ రంగులు పూసుకుని ఆనందంగా ఉండగా ఆదిత్యకు దేవి గుర్తుకువస్తుంది. వెంటనే ఆదిత్య దేవిని చూడటం కోసం కారు తీసుకుని బయలుదేరుతాడు. మరొకవైపు దేవి, చిన్మయి లు హోలీ పండుగ సంబరాలు చేసుకుంటూ ఉంటారు.

అప్పుడు రామ్మూర్తి పిల్లల్ని తీసుకుని తోటలో హోలీ పండుగ జరిగే చోటికి తీసుకెళ్తాడు. పిల్లలు కూడా ఎంతో సంబరంగా సంబరాల్లో పాల్గొనడానికి వెళ్తారు. అక్కడి రాధ, మాధవ కూడా వెళ్తారు. ఇక అక్కడి పిల్లలతో ఆడుకోవడానికి దేవి చిన్మయి వెళ్లగా అప్పుడు మాధవా కి రాధ ఇంట్లో చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి.

దీనితో రాధా నేను నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు. అప్పుడు రాధ సారు అందరూ సంతోషంగా ఉన్నవేళ మీరు నాతో మాట్లాడేది ఏముంటుంది అని రాధా అనగా.. లేదు రాధా నేను నీతో మాట్లాడాలి అని అంటాడు మాధవ. నేను ఇప్పుడు నీతో మాట్లాడితే నేను ఇవ్వాళా సంతోషంగా ఉండగలను అని అనగా సరే పదండి సార్ అని అంటుంది రాధ.

Advertisement
Devatha Serial March 15 Today Episode

రాధా నువ్వు అంటే ఇంట్లో అందరికీ ఇష్టమే. చిన్మయి కూడా నిన్ను చిన్న తల్లి గా అనుకుంటోంది. నేను కూడా ఎప్పుడూ నిన్ను పరాయి వ్యక్తిగా అనుకోలేదు.. మరి ఎందుకు రాద ఇంతలా మారిపోయావు అని మాధవా నిలదీయగా రాధ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అప్పుడు రాదా ఏం జరిగింది సారు ఎందుకు అలా అంటున్నారు అని అనగా.. అప్పుడు మాధవ జరిగిందంతా వివరిస్తాడు.

మరొకవైపు ఆదిత్య ముఖానికి రంగులు పూసుకుని వచ్చి దేవికి ముద్దు పెడతాడు. ఆ విషయం తెలుసుకున్న మాధవ ఆదిత్య ముఖానికి నీళ్లు కొట్టి రంగులు పోయేలా చేస్తాడు. దీంతో వద్దు వద్దు అన్నా వినవా అంటూ నిలదీసింది దేవి. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Devatha: ఆదిత్య గురించి గొప్పగా చెప్పిన రాధ.. రంగంలోకి దిగిన దేవుడమ్మ..?

Advertisement
Exit mobile version