Funny Video : పిల్ల కోతికి కోపం వచ్చింది.. అంతే అద్దాన్ని రాయితో కొట్టింది. ఇప్పుడా ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా జంతువులు చేసే చిలిపి పనులు చూస్తే ఫన్నీగా అనిపిస్తుంది. వాటి చేష్టలు చూసి నవ్వుకుంటారు. నెటిజన్లు కూడా ఇలాంటి ఫన్ని వీడియోలను చూసి నవ్వుతూ పోతుంటారు. కోతుల చేష్టలు అయితే మరింత ఫన్నీగా ఉంటాయి. ఏదో ఒక వస్తువును ఎత్తుకెళ్లడం చేస్తుంటాయి.
ఇక జూలో కనిపించే కోతి పిల్లను బోనులలో పెడుతుంటారు. అలాంటి బోన్లలోని కోతులు బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటాయి. తాను బయటకు వెళ్లేందుకు చాలా ప్రయత్నించింది. కానీ, ఫలితం లేకుండా పోయింది. చివరికి ఓ రాయి తీసుకొచ్చి.. అద్దాన్ని గట్టిగా కొట్టింది. అంతే.. రెండు దెబ్బలకే ఆ అద్దం పగళ్లు వచ్చాయి.
వెంటనే భయంతో కోతి అక్కడి నుంచి బయటకు పారిపోయింది. ఇప్పుడా ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కోతిపిల్లకు కోపం వచ్చింది.. ఇలా అద్దాల మధ్య బోనులో పెడితే ఎవరైనా ఇలా చేస్తారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కోతిపిల్ల మంచి పనే చేసిందంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో ఇదే..
Read Also : Narendra Modi : చెత్తను తొలగిస్తున్న ప్రధాని మోదీ.. వైరల్ వీడియో..!