G
Telugu News » Latest » kasedi donkeys earning crores of rupees
⚡ Latest, Topstory

Interesting news: కాసేది గాడిదలు.. సంపాదించేది మాత్రం రూ. కోట్లు!

Interesting news : చదువు లేకుండా తిరిగే వాళ్లను.. గాడిదలు కాస్తావా అంటూ తిండుతుంటారు చాలా మంది. అంటే గాడిదలు కాయడాన్ని చీపుగా తీసిపడేస్తారు. కానీ తమిళనాడుకు చెం

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Interesting news : చదువు లేకుండా తిరిగే వాళ్లను.. గాడిదలు కాస్తావా అంటూ తిండుతుంటారు చాలా మంది. అంటే గాడిదలు కాయడాన్ని చీపుగా తీసిపడేస్తారు. కానీ తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి గాడిదలు కాస్తూనే కోట్లు సంపాదిస్తున్నాడు. అసలు విషయానికి వస్తే.. తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన బాబు చదువును మధ్యలో ఆపేసి గాడిదలు కాస్తూ రూ. కోట్లు సంపాదిస్తున్నాడు. ఓ కాస్మోటిక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని రూ. కోట్లు సంపాదిస్తూ ప్రముఖ వ్యాపార వేత్తగా మారాడు.

Interesting news

బాబు తన చదువును మధ్యలోనే ఆపేశాడు. ఓ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. అదే సమయంలో ఓ కార్పొరేట్ కాస్మోటిక్ సంస్థ ప్రతి నెలా వెయ్యి లీటర్ల గాడిద పాల కోసం వెతుకుతున్నట్లు తెలిసింది. వెంటనే చేస్తున్న ఉద్యోగాం మానేశాడు. తానే స్వయంగా ఈ రంగంలోకి దిగాడు. 100 గాడిదలు కొన్నాడు. తన స్గనేహితుడి దగ్గర నుండి 17 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ప్యాలెస్ ను ఏర్పాటు చేశాడు.

Advertisement

అందులో వాటిని పెంచుతూ వాటి నుంచి వచ్చే పాలను లీటరుకు రూ. 7 వేలకు కార్పొరేట్ కాస్మొటిక్ సంస్థకు అమ్ముతూ రూ. కోట్లు సంపాదిస్తున్నాడు. గాడిదలు చూసుకోవడానికి కొంత మందిని నియమించాడు. వాటికి స్నానం చేయించడంతో పాటు ఆహారం పెట్టడం, పాలు పితకడం వంటివి వారే చేస్తుంటారు. ప్రస్తుతం బాబు దగ్గర 100 గాడిదలు ఉన్నాయి. వాటి విలువ రూ. 40 వేల నుండి రూ. లక్ష వరకు విలువ చేస్తున్నాయి. గాడిదలు కాస్తూ కోట్లు సంపాదిస్తూ ప్రముఖ వ్యాపార వేత్తగా రాణిస్తున్నాడు.

Read Also :

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷best bussinessdonkeys bussinesshelpful bussinessinteresting news
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు