Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam Feb 10 Episode : సూపర్ క్లైమాక్స్.. సౌందర్య ఎంట్రీతో రుద్రాణికి చెక్..! మండిపోతున్న మోనిత..!

Karthika Deepam Feb 10 Episode : Karthika Deepam Super Climax in Today Episode, Soundarya Gives Check to Rudrani

Karthika Deepam Feb 10 Episode : Karthika Deepam Super Climax in Today Episode, Soundarya Gives Check to Rudrani

Karthika Deepam Feb 10 Episode : బుల్లితెర తెలుగు ప్రేక్షకులను ఎంతోగానూ అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ (1273వ ఎపిసోడ్) సూపర్ క్లైమాక్స్ అదిరిపోయింది. ఇప్పటివరకూ రుద్రాణితో సాగిన కథకు సౌందర్య ఎంట్రీతో క్లైమాక్స్ కు చేరింది. రుద్రాణికి చెక్ పెట్టేసింది.. పది లక్షల చెక్ ముఖాన కొట్టేసింది. డాక్టర్ కార్తీక్, దీప, హిమలతో కలిసి సౌందర్య వస్తుంది. సౌర్య దగ్గరకు రాగానే కార్తీక్‌ని హైదరాబాద్ వెళ్లిపోదాంరా పెద్దోడా’ అంటుంది సౌందర్య.. కానీ, కార్తీక్ అందుకు ఒప్పుకోడు.. సౌందర్య ఎంతంగా బతిమలాడిన నా వల్ల కాదు మమ్మీ అంటాడు కార్తీక్. సౌందర్య పంతానికి పోతుంది.

Karthika Deepam Feb 10 Episode

నీకు ఒక్కడికేనా చెప్పకుండా వెళ్లిపోవడం వచ్చేది… ఫొన్లు పారేయ్యడం వచ్చేది.. నాకు కూడా వస్తుంది.. నేను మీ అమ్మనిరా.. మీ డాడీ ఇద్దరం ఎక్కడికైనా వెళ్లిపోతామని అంటుంది. వస్తున్నారా లేదాని సౌందర్య ఏడ్చేస్తుంది.. దాంతో కార్తీక్ సరేనంటాడు. మరోవైపు.. మోనిత, భారతి ఒకే హోటల్‌లో ఎంట్రీ ఇస్తారు.. అయ్యో భారతి ఇది నా పరిస్థితి.. అంటుంది మోనిత.. భారతి పట్టించుకోదు.. మోనితకి మండిపోతుంది.. బుక్ లాగి విసిరికొడుతుంది. నా బాధలు చెప్పకుంటే పట్టించుకోవా అంటూ భారతిపై కస్సుమంటుంది. మోనితా నీ కష్టాలు కొత్తేమి కాదు. నన్ను అడిగితే అవి కష్టాలే కాదంటుంది. కోరి తెచ్చుకున్నవే అంటుంది భారతి.

భారతి.. నా ధైర్యం చెబుతావని నేను అనుకుంటే ఇలా అంటావేంటి? అడుగుతుంది. ఎన్నోసార్లు హెల్ప్ చేస్తూనే ఉన్నాను అంటుంది భారతి. అసలు కార్తీక్ సంగతి పక్కన పెట్టు.. అసలు నా కొడుకు ఏం చేస్తున్నాడో అంటుంది మోనిత ఏడ్చేస్తుంది. హిమ ఏడుస్తుంటే.. సౌర్య తనను ఓదారుస్తుంది. నాన్నమ్మ రాకుంటే తిరిగి వస్తానని అనుకోలేదు తెలుసా అంటుంది సౌర్య.. ఏడవకు హిమ.. ఇక్కడ ఉండములే.. నాన్నమ్మ నాన్నని ఒప్పిస్తుందిలే అంటుంది. మనం హైదరాబాద్ వెళ్లిపోతాములే అంటుంది సౌర్య.. సౌందర్య కొన్ని బుక్స్ ఒడిలో పెట్టుకుంటుంది. మీరు వచ్చేశాక వీటినే మీ జ్ఞాపకాలుగా చూసుకుని ఏడ్చేదాన్ని తెలుసా అంటుంది సౌందర్య.. హిమ సౌర్యలను చూస్తూ.. ఇలా తన ఆవేదననంతా చెప్పుకొస్తుంది.

Advertisement
Karthika Deepam Feb 10 Episode

బ్యాగ్‌లో పెట్టేసుకోండి’ అంటూ సౌర్యకు అందిస్తుంది. అప్పుడు అందులో ఓ పర్స్ బయట పడుతుంది. నాన్నమ్మా ఈ పర్స్ ఎవరిది అని అడుగుతుంది సౌర్య, హిమ.. దీప, కార్తీక్‌ల పెళ్లి ఫొటో చూసి మురిసిపోతుంది. ఆ పర్స్ కార్తీక్‌కు ఇస్తుంది. నాన్నమ్మా ఆ పర్స్ నాకు ఇవ్వు అంటుంది హిమ.. పర్సులో డబ్బులు చూసి.. ‘అమ్మో ఇంత డబ్బా.. నేను అసలే చూడలేదని అంటుంది. మీ నాన్నదే అది అంటుంది.

పర్స్ ఇంట్లో మరిచిపోయి వచ్చేశాడు మీ నాన్న అంటుంది సౌందర్య.. ఒరే పెద్దోడా.. నీ డబ్బే కదా.. దీప బంగారం విడిపించరా అంటుంది. హిమ వెంటనే పైకిలేచి ‘డాడీ రెస్టారెంట్‌లో ఏమైనా తిందామా? అంటుంది.. మన దగ్గర చాలా డబ్బు ఉందిగా అంటుంది. ప్లీజ్ నాన్నా అని సౌర్య కూడా అనడంతో కార్తీక్ ఒప్పుకుంటాడు. మరోవైపు.. భారతి మనం వెళ్లిపోదాం.. లక్ష్మణ్‌ వాళ్లని ఎవరినైనా ఇక్కడికి పంపించి కార్తీక్‌ని వెతికిస్తానులే అని మోనిత అంటుంది.

Karthika Deepam Feb 10 Episode : తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించిన డాక్టర్ బాబు.. 

డాక్టర్ బాబు.. కర్చిఫ్‌లో కట్టిన బంగారాన్ని దీప ముందు ఉంచుతాడు. దీప మురిసిపోతుంది. తాళిని కళ్లకు అద్దుకుని మెడలో వేసుకుంటుంది. చెవి కమ్మలు కర్చిఫ్‌లో ఉంచి బ్యాగ్‌లో పెట్టుకుంటుంది. ఇంతలో హిమ బాబుని ఎత్తుకుని వస్తుంది. సౌందర్య సౌర్యని తీసుకుని వస్తుంది. ఆనంద్.. మనం హైదరాబాద్ వెళ్లిపోతున్నామని అంటుంది హిమ.. శ్రీవల్లి, కోటేష్‌లు బాబుని ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చారో ఏమైనా సమాచారం తెలిసిందా?’ అంటుంది సౌందర్య. లేదని అంటాడు కార్తీక్. ఇక బయలుదేరదామా అంటుంది సౌందర్య.

Advertisement
Karthika Deepam Feb 10 Episode : Karthika Deepam Super Climax in Today Episode, Soundarya Gives Check to Rudrani

రుద్రాణి.. రౌడీలతో ఎంట్రీ..
ఎక్కడికో వెళ్తున్నారు.. అంటుంది రుద్రాణి. మేము హైదరాబాద్ వెళ్తున్నాం అంటుంది దీప.. ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అంటుంది దీప. చెక్ రాసి ముఖాన్న కొట్టిపోతే ఎలా మేడమ్… అంటుంది రుద్రాణి.. ఈ చెక్ నాకు వద్దు మేడమ్ అంటుంది. క్షమించండి సారు.. డాక్టర్ గారు.. అమ్మా దీపమ్మా.. నన్ను క్షమించమ్మా.. పిల్లలంటే నాకు ఇష్టమని అంటుంది. మీ అందరిని ఎన్నో కష్టాలు పెట్టాను.. అంటూ క్షమాపణలు కోరుతుంది. అంతే ఇక్కడితో ప్రీ క్లైమాక్స్‌ చేరుకుంటుంది.

Read Also : Karthika Deepam : హిమను ఎత్తుకు వెళ్ళిన రుద్రాణి.. అది తెలిసి రుద్రాణి ఇంటికి వచ్చిన సౌందర్య!

Advertisement
Exit mobile version