Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Father Worship : తండ్రి ప్రేమంటే ఇదే.. పుత్తడి బొమ్మలాంటి కూతురికి గుడికట్టిన తండ్రి.. నిత్యం పూజలు చేస్తున్నాడు..!

Father Worship : కంటే కూతుర్నే కనాలి అంటారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురు అకాల మరణంతో ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. కూతురి మరణాన్ని జీర్ణించుకోలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తిరిగిరాని లోకాలకు వెళ్లిన కూతురి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ గడిపేస్తున్నాడు. సాధారణంగా ఎవరి ఇంట్లో అయిన ఆడపిల్ల పుడితే.. మహాలక్ష్మి పుట్టిందంటారు. అందరికి కన్నా ఎక్కువగా ఆనందపడేది తండ్రి మాత్రమే. అలాంటి తండ్రి తన చేతులతో ఎత్తుకుని పెంచిన కూతురు విగతజీవిగా కనిపించడంతో అల్లాడిపోయాడు. ఎంతో ముద్దుగా పెంచి ఆటలు ఆడించిన కన్న కూతురు ఇకలేదనే వార్తను దిగమింగలేకోపయాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సి వయస్సుకు వచ్చాక ఒక అయ్య చేతుల్లో పెట్టాలనుకున్నాడు. కానీ, అతడి ఆశలన్నీ అడిఆశలయ్యాయి.

Father Built a Temple for His Daughter And Worship to Her at House in Bhimavaram

18ఏళ్ల వయస్సులో కుమార్తె అకస్మాత్తుగా చనిపోవడంతో ఆ తండ్రి పడే మానసిక వేదన అంతాఇంతా కాదు.. ఎవరూ కూడా ఆ తండ్రిని ఓదార్చలేని పరిస్థితి. ప్రతీక్షణం కూతురు లేదనే చేదు నిజాన్ని గుర్తు చేసుకుంటూ కుమిలిపోతాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓడపాటి రవితేజ మాత్రం తన కూతురు చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎంతో ముద్దుగా పెంచుకున్న కూతురు ప్రసన్నా దేవి (18) వయసులో అనుకోని ప్రమాదంలో చనిపోయింది. ఎంతో బాధపడ్డాడు. చివరికి తేరుకున్నాడు..

తన కుమార్తె దేవతగా భావించాడు. కూతురికి ఏకంగా ఇంట్లోనే గుడి కట్టించాడు. ప్రతిరోజు పూజలు ఆ గుడిలో కూతురి విగ్రహానికి పూజలు చేస్తున్నాడు. అంతేకాదు.. కూతురి పేరిట ట్రస్ట్‌ కూడా ఏర్పాటు చేశాడు. ఆ ట్రస్ట్‌ ద్వారా చాలా మందికి సహాయం చేస్తున్నాడు. కూతురి పట్ల తండ్రికి ఉన్న ప్రేమను ఇలా నలుగురికి సాయం చేస్తూ అందరిలో తన కూతురిని చూసుకుంటూ మురిసిపోతున్నాడు పిచ్చి తండ్రి. రవితేజ చేస్తున్న సాయానికి ఆ ఊరి ప్రజలంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Advertisement

Read Also : Crime News: కానిస్టేబుల్ కూతురికి ప్రేమ వేధింపులు, హత్య కూడా!

Exit mobile version